ప్రీ రిలీజ్ కు సిద్ధమౌతున్న 'గాడ్ ఫాదర్'

ప్రీ రిలీజ్ కు సిద్ధమౌతున్న 'గాడ్ ఫాదర్'

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'గాడ్ ఫాదర్'. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ మెగా పబ్లిక్ ఈవెంట్ నిర్వహించనున్నారు మేకర్స్. సెప్టెంబరు 28న అనంతపూర్ లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో సాయంత్రం 6 గంటలకు జరగనుంది. చిరంజీవితో పాటు గాడ్ ఫాదర్ టీమ్‌ ఈ మెగా వేడుకకు హాజరుకానున్నారు.

కాగా, సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని ముఖ్య తారాగణం. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.