ఉత్తమ నటుడు హృతిక్, ఉత్తమ నటి ఆలియా.. దుబాయ్ లో అట్టహాసంగా ఐఫా 2023

ఉత్తమ నటుడు హృతిక్, ఉత్తమ నటి ఆలియా.. దుబాయ్ లో అట్టహాసంగా ఐఫా 2023

IIFA 2023: దుబాయ్‌ వేదికగా ఐఫా అవార్డ్స్ 2023 వేడుక అట్టహాసంగా జరిగింది. శనివారం జరిగిన రాత్రి జరిగిన ఈ ఈవెంట్ లో పలువురు స్టార్ సెలబ్రెటీస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈ ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్స్ అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. రకుల్ ప్రీత్ సింగ్, కృతి సనన్, నోరా ఫతేహి, జాక్వలిన్ ఫెర్నాండేజ్ వంటి బ్యూటిఫుల్ హీరోయిన్స్ చేసిన డాన్సులు ఆడియన్స్ ఫుల్ ఎంటర్‌టైన్ చేశారు. ఇక 2023కి గాను ఎవరెవరు ఏ అవార్డులు గెలుచుకున్నారో ఇప్పుడు చూద్దాం. 

2023 ఉత్తమ నటుడిగా విక్రమ్ వేద సినిమాకు హృతిక్‌ రోషన్ అవార్డును సొంతం చేసుకున్నాడు. గంగూబాయి కఠియావాడి సినిమాకి ఉత్తమ నటిగా ఆలియా భట్ ఈ అవార్డుకు అందుకుంది. ఉత్తమ చిత్రంగా మిస్టరీ థ్రిల్లర్‌ దృశ్యం-2 నిలిచింది. ఈ వేడుకల్లో బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1, గంగూబాయి కాథియావాడి చిత్రాలు అత్యధిక అవార్డులను దక్కించుకోవడం విశేషం.

ఐఫా 2023 అవార్డుల అందుకున్న విజేతల వివరాలు

ఉత్తమ సహాయ నటుడు: అనిల్‌ కపూర్‌ (జగ్‌జగ్‌ జీయో)

ఉత్తమ సహాయనటి: మౌనీ రాయ్‌(బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1)

ఉత్తమ దర్శకుడు: ఆర్‌.మాధవన్‌ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌)

ఉత్తమ సంగీత దర్శకుడు: ప్రీతమ్‌ (బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1)

ఉత్తమ స్క్రీన్‌ప్లే : గంగూబాయి కాఠియావాడి

ఉత్తమ సంభాషణలు: గంగూబాయి కాఠియావాడి

ఉత్తమ సినిమాటోగ్రఫీ: గంగూబాయి కాఠియావాడి

ఉత్తమ గీత రచయిత: అమిత్‌ భట్టాచార్య (కేసరియా: బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1)

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ : బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1

ఉత్తమ కొరియోగ్రఫీ: భూల్‌ భూలయా2

ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: భూల్‌ భూలయా 2

ఉత్తమ ఎడిటింగ్‌: దృశ్యం2

ఉత్తమ నేపథ్య సంగీతం: విక్రమ్‌ వేద

ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్‌: మోనికా ఓ మై డార్లింగ్‌