జడ్చర్ల, వెలుగు: దొంగలు భారీగా సిగరెట్ కాటన్లను ఎత్తుకెళ్లిన ఘటన మహబూబ్‌నగర్‌జిల్లా బాదేపల్లి టౌన్ లో జరిగింది. రూ. 50 లక్షలు విలువైన కాటన్లనుఎత్తుకెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి జరిగి ఉంటుందని సీసీ పుటేజీలు పరిశీలించిన పోలీసులు పేర్కొంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీరాంనగర్ ఐటీసీ సెంటర్(ఆర్‌కే గోడౌన్స్)లో శనివారం రాత్రి రూ.60 లక్షలు విలువైన సిగరేట్ కాటన్లను హైదరాబాద్ నుంచి దిగుమతి చేసి నిల్వ చేశా రు.
ప్లాన్ ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో గోడౌన్షటర్స్తాళాలు పగలగొట్టి, సిగరెట్కాటన్లను ఎత్తుకెళ్లారు. ఉదయం స్థానికులు చూసి ఫోన్ చేసి చెప్పగా.. యజమాని మణికర్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఎస్ఐ చంద్రమోహన్‌రావు తెలిపారు. గోడౌ న్లో గతంలో కూడా ఇదే తరహా చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు.