- టైటిల్: ది ఇండియా స్టోరీ
- డైరెక్షన్: చేట్టన్ డి.కె
- కాస్ట్: కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తాల్పడే, మురళి శర్మ, మనీష్ వాద్వా, త్రిషా సర్దా
- ప్లాట్‌ఫాం: జియో హాట్‌స్టార్
యోగేశ్ పాటిల్ (శ్రేయాస్ తల్పాడే) ఒక ఆర్మీ అధికారి. అతనికి ఏడేళ్ల కూతురు పరి (త్రిష శ్రద్ధా). అంతా సంతోషంగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో పరి క్యాన్సర్ బారిన పడుతుంది. ఈ విషయం తెలియగానే కూతురును ఎలాగైనా బతికించుకోవాలనే తాపత్రయంతో యోగేశ్ తన ఉద్యోగాన్ని సైతం వదిలేస్తాడు. తమ పూర్వీకుల్లో ఎవరికీ క్యాన్సర్ లేదని అతను వైద్యులకు చెబుతాడు.
అయితే, ఆహార పంటల్లో మోతాదుకు మించి క్రిమిసంహారక మందులు వాడటం వల్లే పరి క్యాన్సర్ బారిన పడిందని వైద్యులు చెబుతారు. తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు చేసినా యోగేశ్ కూతురును కాపాడుకోలేకపోతాడు. తనలా మరే తండ్రికీ ఈ బాధ ఎదురు కాకూడదని భావించి, క్రిమిసంహారక మందులు తయారు చేసే సంస్థలతో పాటు వాటిని పంటలకు ఉపయోగించే రైతులపై కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు. తన కూతురి మరణం సాధారణ మరణం కాదని, అది హత్యతో సమానమని ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని ఆవేదనను ఎవరూ పట్టించుకోరు.
కోర్టులోనూ అతనికి నిరాశే ఎదురవుతుంది. సమాజంలో నిస్సహాయుడైన తండ్రిగా మిగిలిపోయిన యోగేశ్‌కు తన బాధను అర్థం చేసుకునేవారే కరువవుతారు. అలాంటి సమయంలో అడ్వకేట్ అర్చన అతనికి అండగా నిలుస్తుంది. ఈ కేసును ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎలాంటి భయంకరమైన నిజాలు తెలుస్తాయి? వాటిని కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది? ఈ పోరాటంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లేమిటి? అన్నదే కథ.
