‘ఇరుముడి’ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ అని రవితేజ అన్నారు. ఆయన హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న పాన్ ఇండియావైడ్‌గా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రవితేజ మాట్లాడుతూ ‘నాకు తమిళ సినిమాతో చాలా అనుబంధం ఉంది. నా సినీప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది. ఈ సినిమాకొస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇస్తోంది. క్లైమాక్స్‌లో జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. నక్షత్ర ఫ్యూచర్‌లో పెద్ద స్టార్ అవుతుంది.
ప్రియా చాలా సహజంగా నటించింది. మా నిర్మాతలు రవి, నవీన్ నాకు చాలా మంచి స్నేహితులు. అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం. ఈ మూవీ విషయంలో మొదటి నుంచీ మేం పెట్టుకున్న నమ్మకం నిజం అయ్యింది. ఈ సినిమాని మనసులో పెట్టుకున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సో మచ్’ అని అన్నారు. ప్రేక్షకులు సినిమాని గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందని ప్రియా భవానీ శంకర్ చెప్పింది.
ఇది తనకు చాలా స్పెషల్ ఫిల్మ్ అని బేబీ నక్షత్ర చెప్పింది. దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ‘డివోషనల్, ఫ్యామిలీ, క్రైమ్ ఇలా మూడు లేయర్స్ ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తోంది. ఇందులో ఉన్న సందేశం అందరికీ నచ్చుతుంది’ అని చెప్పాడు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ‘అయ్యప్ప స్వామి సౌత్ ఇండియాలో బిగ్ ఎమోషన్. తమిళంలో కూడా సినిమా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తోంది. ఇది కల్ట్ క్లాసిక్ ఫిల్మ్. ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని అన్నారు.
