‘ది కాశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వై కేటగిరీ సెక్యూరిటీ

‘ది కాశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వై కేటగిరీ సెక్యూరిటీ

న్యూఢిల్లీ: ‘ది కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైల్స్’ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి కేంద్రం వై కేటగిరీ భద్రత కల్పించింది. సినిమా రిలీజైన తర్వాత అగ్నిహోత్రి ప్రాణాలకు ముప్పు ఏర్పడడంతోనే సీఆర్పీఎఫ్ కమాండోలతో వై కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఏడు నుంచి ఎనిమిది మంది కమాండర్లు ఆయనకు 24 గంటలూ భద్రత కల్పించనున్నారు. సినిమా కారణంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని అగ్నిహోత్రి కంప్లైంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన వారం తరువాత మినిస్ట్రీ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోం ఎఫైర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. టెర్రరిజం కారణంగా కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోయ నుంచి వలస వెళ్లిన కాశ్మీరీ పండిట్ల కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కాగా, ఈ సినిమాపై ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా ప్రశంసలు కురిపించారు. నిజమైన చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించారని అన్నారు. కాశ్మీరీ పండిట్ల భరించలేని బాధ, పోరాటాన్ని ప్రపంచానికి తెలియజేశారని చెప్పారు.