పవన్ దర్శకత్వంలో చిరంజీవి.. సేనాపతి ఎఫెక్ట్ కారణమా?

పవన్ దర్శకత్వంలో చిరంజీవి.. సేనాపతి ఎఫెక్ట్ కారణమా?

భోళా శంకర్(Bhola shankar) తరువాత మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) చేయబోయే సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇటీవల ఆగస్టు 22 మెగాస్టార్ పుట్టినరోజు సంధర్బంగా రెండు కొత్త సినిమాలను అనౌన్స్ చేశారు చిరంజీవి. అందులో ఒకటి ఆయన కూతురు సుష్మిత(Sushmitha) నిర్మాతగా రానున్న సినిమా కాగా.. రెండవది యూవీ క్రియేషన్స్(UV Creations) బ్యానర్ లో వశిష్ట(Vassishta) దర్శకత్వంలో వస్తున్న సినిమా. 

ఈ రెండింటిలో చిరంజీవి కూతురు సుష్మిత బ్యానర్ గ్లోడ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్(Gold box entertainments) లో రానున్న సినిమా ముందుగా సెట్స్ పైకి వెళ్లనుంది. మెగా156(Mega156) గా రానున్న ఈ సినిమాకు ఇంకా దర్శకుడు ఎవరన్నది కన్ఫర్మ్ కాలేదని సమాచారం. అందుకే బర్త్ డే సంధర్బంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో దర్శకుడి పేరు మెన్షన్ చేయలేదు. నిజానికి ఈ ప్రాజెక్టు కోసం ముందుగా కళ్యాణ్ కృష్ణ కురసాల(kalyan krishna kurasala) పేరు బలంగా వినిపించింది. ఆయనతో బ్రో డాడీ(Bro daddy) సినిమాను రీమేక్ చేయాలని అనుకున్నారు మేకర్స్. అయితే భోళా శంకర్ రిజల్ట్ వల్ల ఈ రీమేక్ ను వాయిదా వేశారని సమాచారం. 

అందుకే ఈ ప్రాజెక్టు కోసం మరో దర్శకుడి పేరును పరిశిలీస్తున్నారట మేకర్స్. అతనే సుష్మిత ప్రొడక్షన్ హౌస్ లో సేనాపతి(Senapthi) అనే వెబ్ సిరీస్ తీసిన దర్శకుడు పవన్ సాదినేని(Pawan sadineni). ఈ దర్శకుడు ఈ మధ్య జీడీ చక్రవర్తి(JD Chakarvarthy)తో దయ(Daya) అనే మరో వెబ్ సిరీస్ ను కూడా తీశాడు ఈ దర్శకుడు. దీంతో ఈ దర్శకుడికి కూడా కథ రెడీ చెయ్యమని సూచించారట. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరు మంచి కథతో వస్తే వారితోనే చిరంజీవి నెక్స్ట్ మూవీ ఉండనుంది అనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు చిరును ఇంప్రెస్ చేసే స్టోరీ తో వస్తారో చూడాలి.