సత్యభామ ఫైట్స్‌‌‌‌..

సత్యభామ ఫైట్స్‌‌‌‌..

కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌‌‌‌లో నటి స్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  ‘మేజర్’ డైరెక్టర్ శశికిరణ్ తిక్క సమర్పణలో ఆయన సోదరుడు బాబీ తిక్క, తక్కెళ్లపల్లి శ్రీనివాస రావు నిర్మిస్తున్నారు.  శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఓ లెంగ్తీ షెడ్యూ ల్‌‌‌‌ను కంప్లీట్ చేశారు. 35 రోజుల పాటు జరిపిన చిత్రీకరణతో  90 శాతం షూట్ పూర్త య్యింది. ఈ షెడ్యూల్‌‌‌‌లో ఫైట్ మాస్టర్ సుబ్బు ఆధ్వర్యంలో  హ్యూజ్ యాక్షన్ సీన్స్‌‌‌‌లో నటించింది కాజల్.

 ఈ యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్‌‌‌‌గా నిలుస్తాయని చెప్పారు మేకర్స్.  బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేసి త్వర లోనే రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేస్తాం అన్నారు. ఇందులో కాజల్ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో కనిపించనుంది. నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.