Chiranjeevi: క్షేమంగానే చిరంజీవి తల్లి.. క్లారిటీ ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు

Chiranjeevi: క్షేమంగానే చిరంజీవి తల్లి.. క్లారిటీ ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని మెగా వర్గాలు ధృవీకరించాయి.

అలాగే, మెగా బ్రదర్, MLC నాగబాబు సైతం క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు తన X ఖాతాలో పోస్ట్ పెట్టారు. 'అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. కొందరు తప్పుడు సమాచారాన్ని బయట ప్రచారం చేస్తున్నారు. ఆమె పూర్తిగా క్షేమంగా ఉంది' అని మెగా నాగబాబు క్లారిటీ ఇచ్చారు.

నేడు (జూన్ 24) ఉదయం నుంచి అంజనా దేవి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలొస్తున్నాయి. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారని, ఆమె హెల్త్ సరిగా లేదని తెలియడంతోనే పవన్ కల్యాణ్ హైదరాబాద్ వచ్చేశారని అనుకున్నారు అంతా.

ఈ క్రమంలోనే తన తల్లి పూర్తి క్షేమంగానే ఉందని.. ఆరోగ్యంపై ఊహజనిత కథనలు ప్రచురించవద్దని నాగబాబు కోరడంతో క్లారిటీ వచ్చేసింది. ఉదయం నుండి ఆందోళనలో ఉన్న మెగా అభిమానుల్లో ఈ లేటెస్ట్ అప్డేట్ ఊరటనిస్తోంది. అయితే గతంలో కూడా అంజనా దేవి ఆరోగ్య పరిస్థితిపై వార్తలు వచ్చాయి. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారని కథనాలు వెలువడ్డాయి.