నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే సెప్టెంబర్ 24 విడుదల కావాల్సిన ఈ సినిమా.. మరోసారి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్లైమాక్స్‌లో భారీ స్థాయిలో సీజీ వర్క్ జరుగుతోందని, దీనికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు అనుకున్న సమయానికి పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతోనే విడుదల తేదీపై సందిగ్ధత ఏర్పడినట్టు తెలుస్తోంది.
ఈ సీజీ వర్క్ కోసం నిర్మాతలు భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారని, పనులు పూర్తి చేయడానికి మరింత సమయం అవసరమవుతోందని టాక్. దీంతో ఈ చిత్రాన్ని అక్టోబర్ 1కి వాయిదా వేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
నాని ప్రస్తుతం అమెరికా నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో సినిమా విడుదల తేదీపై యూనిట్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు అక్టోబర్ తొలి వారంలో ఇప్పటికే పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో థియేటర్ల విషయంలోనూ పోటీ నెలకొనే అవకాశం ఉంది.
