The Paradise OTT: దసరా వేళ నాని మాస్ ట్రీట్.. ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. రిలీజ్ డేట్ అనౌన్స్

The Paradise OTT: దసరా వేళ నాని మాస్ ట్రీట్.. ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. రిలీజ్ డేట్ అనౌన్స్

దసరా పండగ అంటేనే సందడి.. కొత్త సినిమాల హడావుడి.. ఫ్యామిలీతో కలిసి ఎంటర్‌టైన్‌మెంట్. అలా ఈ పండగ వేళ సినీ అభిమానులకు నాని తన మాస్ ట్రీట్‌తో పలకరించేందుకు సిద్ధమయ్యాడు. జడల్ గాడి రఫ్ లుక్, రగ్డ్ యాక్షన్, పవర్‌ఫుల్ ఫైట్స్‌తో థియేటర్లలో రచ్చ చేసిన ‘ది ప్యారడైజ్’ (The Paradise) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. దసరా సెలవుల్లో ఇంట్లోనే కూర్చుని నాని మాస్ పెర్ఫార్మెన్స్‌ను ఆస్వాదించాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఆప్షన్‌గా మారనుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. మరి జడల్ జమానా ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఏయే భాషల్లో సినిమా అందుబాటులోకి రానుంది? ఓటీటీలో కొత్త సీన్లు ఉంటాయా? ఉండవా ? అనేది తెలుసుకుందాం..

ది ప్యారడైజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..

‘ది ప్యారడైజ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. అక్టోబర్ 22, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.173 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాని ‘జడల్’గా రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించారు. అణగారిన ప్రజల హక్కుల కోసం పోరాడే నాయకుడిగా ఆయన నటన, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. 

ఓటీటీలో కొత్త సీన్లు ఉంటాయా?

‘ది ప్యారడైజ్’ ఓటీటీ వెర్షన్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. థియేటర్లలో తొలగించిన ఎమోషనల్ సీన్లను జోడిస్తారని, కొన్ని హింసాత్మక సన్నివేశాలను తగ్గిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ మార్పులపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త వెర్షన్ వస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. మరి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మిక్సెడ్ టాక్ అందుకున్న ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి..