THE PARADISE Teaser: నాని ‘ది ప్యారడైజ్‌‌’ టీజర్ రిలీజ్.. జడల్ మాస్ ర్యాంపేజ్‌కు గూస్‌బంప్స్ గ్యారెంటీ

THE PARADISE Teaser: నాని ‘ది ప్యారడైజ్‌‌’ టీజర్ రిలీజ్.. జడల్ మాస్ ర్యాంపేజ్‌కు గూస్‌బంప్స్ గ్యారెంటీ

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్‌‌’ (THE PARADISE). ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇవాళ (ఆగస్టు 6న) విడుదలకాగా, సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది.

టీజర్ హైలైట్స్..

1 నిమిషం 35 సెకన్ల నిడివి గల ‘ది ప్యారడైజ్‌‌’ టీజర్.. ప్రేక్షకులను ఓ కొత్త, మునుపెన్నడూ చూడని లోకంలోకి తీసుకెళ్తుంది. శ్రీకాంత్ ఓదెల తనదైన శైలిలో రా అండ్ రస్టిక్ (Raw and Rustic) విజువల్స్‌తో సినిమాపై భారీ క్యూరియాసిటీని పెంచేశారు. ఇందులో నాని ‘జడల్’ అనే పవర్‌ఫుల్, ఊరమాస్ పాత్రలో కనిపించి దడల్ పుట్టిస్తున్నాడు. ముఖ్యంగా టీజర్‌లో నాని యాక్టింగ్, లుక్స్, డైలాగ్ డెలివరీ కేక పుట్టించేలా ఉన్నాయి.

తనలోని మాస్ ఫైర్‌ను నాని ఈసారి నెక్స్ట్ లెవల్‌లో చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ టీజర్‌కు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) ప్రాణం పోసింది. విజువల్స్‌తో పాటు అనిరుధ్ ఇచ్చిన ఆర్ఆర్ థియేటర్లలో గూస్‌బమ్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక నుంచి... ఈ జాగా ఎవరిది.. ఈ దేశం ఎవరిది... అని నాని చెప్పే డైలాగ్ ఊచకోత పెట్టెలా ఉంది. ఛీ అని ఉమ్మేసిన ఆ గాఢమైన నలుపు రంగే.. మన జెండా.. మాకే దానిమీద గుర్తు.. నువ్వనుకున్నట్టు కాదు.. మేం ఏంటో చూపిస్తాం.. అని నాని చెప్పే డైలాగ్.. తన పోరాటంలో ఉన్న ఇంటెన్సిటీని ఎలివేట్ చేస్తుంది.. మొత్తానికి, ‘ది ప్యారడైజ్‌‌’ టీజర్ విడుదలైన క్షణం నుంచే ట్రెండింగ్‌లో నిలిచింది. కేవలం మాస్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా, బలమైన భావోద్వేగాలతో కూడిన కథాంశంతో ఈ సినిమా రాబోతున్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది. నాని కెరీర్‌లోనే ఇదొక బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్‌గా నిలిచేలా ఉంది!

సెప్టెంబర్ 24న థియేటర్లోకి జడల్

ఈ చిత్రంలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్,  సంపూర్ణేష్ బాబు, కయాదు లోహర్, తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి  కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 21న సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించగా, ఆ డేట్‌‌కు వచ్చే పరిస్థితి లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. టీజర్‌‌‌‌తోపాటు కొత్త రిలీజ్ డేట్‌‌ను కూడా అనౌన్స్ చేసారు. పాన్ వరల్డ్ గా  రూపొందుతున్న ఈ మూవీ  సెప్టెంబర్ 24న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో విడుదల కానుంది.