Bhola Shankar: భోళా శంకర్ వివాదంపై స్పందించిన ప్రొడక్షన్ హౌస్.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్

Bhola Shankar: భోళా శంకర్ వివాదంపై స్పందించిన ప్రొడక్షన్ హౌస్.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ (Bhola Shankar). స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్(Meher Ramesh) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మించారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ తెచ్చకుంది. ఈ మూవీ కలెక్షన్స్ దారుణంగా పడిపోవడంతో..అనిల్ సుంకర తన ఆస్తులని పోగొట్టుకున్నాడని సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

లేటెస్ట్ గా ఇదే విషయం పై ప్రొడక్షన్ హౌస్  ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్(AK Entertainments) స్పందిస్తూ.. ఆన్‌లైన్‌లో భోళా శంకర్ మూవీ గురుంచి.. ప్రసారం అవుతున్న వివాదాలకు సంబంధించిన పుకార్లు పూర్తిగా బేస్‌లెస్, సెన్స్‌లెస్ అని ట్వీట్ చేశారు. ఇందులో కనీసం ఒక్క శాతం కూడా నిజం లేదని తెలిపింది. అనవసరమైన న్యూస్ తో, టైం వెస్ట్ చేయడంతో పాటు, అనవసరమైన చర్చలు పెట్టకండి అంటూ  ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పేర్కొంది.  భోళా శంకర్ మూవీ 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా.. ప్రపంచవ్యాప్తంగా 33 కోట్లను మాత్రమే వసూలు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. 

ఇక లేటెస్ట్ గా చిరు కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్షన్ లో ఓ మూవీ చేయుటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీకు బెజవాడ ప్రసన్న కుమార్  స్టోరీ అందిస్తున్నారు. ఇక చిరు బింబిసార డైరెక్టర్ వశిష్ఠ తో కూడా మూవీ ఒకే చేశారని సమాచారం. హరీష్ శంకర్ డైరెక్షన్ లో కూడా మెగాస్టార్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.