నెల్లికుదురు పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ కార్యకర్తల అందోళన

నెల్లికుదురు పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ కార్యకర్తల అందోళన

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ కార్యకర్తల అందోళన కొనసాగుతోంది. తమపై దాడికి పాల్పడిన బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయలంటూ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ గిరిజన మెర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత ఏర్పడింది. మరోవైపు.. పోలీస్ స్టేషన్ కు బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. 

అంతకుముందు ఏం జరిగిందంటే..? 

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల గ్రామంలో బీజేపీ నాయకులపై బీఆర్ఎస్ కార్యకర్తలు కర్రలు, కుర్చీలతో దాడి చేశారు. బీజేపీ కార్నర్ మీటింగులో మాట్లాడుతున్న ఆ పార్టీ గిరిజన మెర్చా రాష్ట్ర ఆధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్, స్థానిక బీజేపీ ఎంపీటీసీ మదన్ పై అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు. ‘నైనాల గ్రామం ఎమ్మెల్యే శంకర్ నాయక్ అడ్డా’ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు హల్ చల్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరగింది. దీంతో నైనాల గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో నెల్లికుదురు పోలీసులు నైనాల గ్రామానికి వెళ్లారు. కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని.. విచారిస్తున్నారు.