
ప్రభాస్ నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ‘సాలార్’ కూడా ఒకటి. ‘కేజీయఫ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడుతో జరుగుతోంది. ఇటీవలే కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ భువన గౌడ సోషల్ మీడియాలో షేర్ చేశారు. నైట్ షూట్‌కు సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేయడంతో పాటు, ‘సాలార్’ షూటింగ్ జరుగుతోంది అని క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటికే ఎనభై ఐదు శాతం షూటింగ్ పూర్తయిందని ఆమధ్య నిర్మాత విజయ్ కిరగందూర్ క్లారిటీ ఇచ్చారు.
కొత్త షెడ్యూల్ కూడా మొదలైంది కనుక మరో నెల రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే ప్రకటించినట్టుగా ఈ ఏడాది సెప్టెంబర్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఖరారైనట్టే. మరోవైపు ‘ఆదిపురుష్’ సినిమాను జూన్ 16న రిలీజ్ చేయబోతున్నట్టు మరోసారి కన్‌ఫర్మ్ చేశాడు దర్శకుడు ఓం రౌత్. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజా డీలక్స్’ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయి, ఈ నెలాఖరులో మూడో షెడ్యూల్ షూట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇది కూడా ఇయర్ ఎండింగ్‌కు రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి ప్రభాస్ నుండి ఈ ఏడాది మూడు సినిమాలు రాబోతున్నాయి.