ఎకరానికి కోటి రూపాయల ఆదాయం వెనుక.. కేసీఆర్ అసలు రహస్యం ఇదే.?

ఎకరానికి కోటి రూపాయల ఆదాయం వెనుక.. కేసీఆర్ అసలు రహస్యం ఇదే.?

తెలివిగా వ్యవసాయం చేస్తే ఎకరానికి కోటి రూపాయలు సంపాదించవచ్చని గతంలో కేసీఆర్ చెప్పారు. తాను స్వయంగా వ్యవసాయం చేసే పెద్ద రైతునని అభివర్ణించుకున్నారు. అంత పెద్ద నాయకుడు చెబితే నిజమేనని చాలామంది నమ్మారు. కానీ ఎకరానికి కోటి రూపాయలు ఎట్లా సంపాదించాలన్నది మాత్రం ఇన్నేళ్లలో ఎవరికీ అంతుబట్టని రహస్యంగా  మిగిలిపోయింది. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే కోటి సంపాదన సాధ్యమే కావచ్చని అనిపిస్తోంది. వేలకోట్ల జనం సొమ్ముతో రిజర్వాయర్, భారీ కెనాల్​, చెరువులు, నీళ్లు నేరుగా పొలానికి తెచ్చిపోసేలా ఏర్పాట్లు ఉంటే పంట ఆదాయం మొత్తం లాభమే కదా! ఉచితంగా సలహాలిచ్చే వ్యవసాయ నిపుణులు కూడా ఉంటే రాబడి కోట్లలో ఉండే అవకాశం లేకపోలేదు. కేసీఆర్ వ్యవసాయంలో లాభాల అసలు రహస్యం బహుశా ఇదేనేమోననే చర్చ జరుగుతోంది.
 

కెనాల్​ నీళ్లు డైరెక్ట్​గా ఫాంహౌస్​కే

కొండపోచమ్మ సాగర్​కేలి ఆలేరు భువనగిరి పోయే కెనాల్​ఇప్పినమనుకో నీళ్లు డైరెక్ట్​ వచ్చి ఫాం హౌస్ లకే  పోతయి.  ఒక్కొక్కటి ఆరెకరాలు, ఏడెకరాలు, ఎనిమిదెకరాలు మడి ఉంటది. ఆ మడుల చుట్టూ ఊళ్లల్ల మోరీ ఉన్నట్టు సీసీ కెనాల్స్​ ఉంటయి.  వాటర్​ ఇప్పంగనే ఎటుయటు ఎళ్లిపోతయి. మడి మడికి ఇదే గేట్లు ఉంటయి.   - శ్రీధర్, రైతు 

చెరువుల కేంచి పైపు లైను తోని బావిని నింపుకుంటడు

ఈ బాయి మూడు ఎకరాలుంటది. కేసీఆర్​ సీఎం అయినంక ఫస్ట్​ తవ్వించుకున్నడు. కొండపోచమ్మసాగర్​నుంచి పాండురంగ చెరువులోకి నీళ్లు వస్తయి. చెరువుల కేంచి పైపు లైను తోని బావిని నింపుకుంటడు. బావిలకేలి ఫాంహౌస్​ పారించుకుంటడు..    - శ్రీను, రైతు
 

రైతుల కోసం ఆలోచన చేస్తలేడు.  

కేసీఆర్​కు మూడెకరాల బాయి ఉంది.  మా ఉళ్లోనే ఇద్దరు ముగ్గురు రైతుల పొలాలు ఎండిపోయినయి. వాళ్లకు కూడా ఇక్కడ నుంచి  పైపులేసి నీళ్లు ఇయ్యచ్చుకదా. ఇదంతా  ప్రజలకోసమే చేస్తున్న అని ఆయన చెప్తడు కదా.. మరెందుకో రైతుల కోసం ఆలోచన చేస్తలేడు.    - మధు, రైతు 

ఫామ్ హౌస్​ చేయవట్టి 10, 15 విలేజ్​లకు నీళ్లు​ లేవు

మేయిన్​ గేటు కాడ ఉండె నాభూమి.. ఐదెకరాల 15 గుంటల భూమి..  నన్నయితే మోసం చేసిండ్రు సార్​ వాళ్లు. నాకు నీళ్లు ఇస్తనంటెనే 43 లక్షల కాడికి  ఇచ్చిన..  లేకుంటే ఇయ్యకనేపోదు. ఫామ్ హౌస్​ చేయవట్టి 10, 15 విలేజ్​లకు వాటర్​ లేవు.     
- కేసీఆర్​ ఫాంహౌస్​ 
సమీపంలోని రైతు