కుబేర.. బిచ్చగాడు వెర్సస్‌ బిలియనీర్ కథ.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల చెప్పిన ముచ్చట్లు !

కుబేర.. బిచ్చగాడు వెర్సస్‌ బిలియనీర్ కథ.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల చెప్పిన ముచ్చట్లు !

శేఖర్ కమ్ముల.. మనిషి ఎంత సింపుల్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తారో ఆయన సినిమాలు కూడా అంతే స్వచ్ఛంగా మనసుకు హత్తుకునేలా ఉంటాయి. ఫీల్‌‌‌‌‌‌‌‌ గుడ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  ఎన్నో ఆహ్లాదకరమైన చిత్రాలు  తెరకెక్కించిన ఆయన.. ఈసారి ధనుష్, నాగార్జున, రష్మిక లాంటి హ్యూజ్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌తో డిఫరెంట్‌‌‌‌‌‌‌‌ కంటెంట్‌‌‌‌‌‌‌‌తో ‘కుబేర’ సినిమా తెరకెక్కించారు.  సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం   జూన్ 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాల గురించి శేఖర్ కమ్ముల ఇలా ముచ్చటించారు.  

    ధనిక, మధ్య తరగతి, పేద అనే మూడు ప్రపంచాల నేపథ్యంలో జరిగే కథ ఇది. వాస్తవికతకు దగ్గరగా ఉంటూనే ఓ థ్రిల్లింగ్ పాయింట్‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కించా. సింపుల్‌‌‌‌‌‌‌‌గా చెప్పాలంటే బిలియనీర్ వర్సెస్‌‌‌‌‌‌‌‌ బెగ్గర్ కథ ఇది.  అసలేమీ ఆశించని బిచ్చగాడు, అన్నీ కావాలనుకునే ధనికుడికి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ. అలాగని సమాజం మారిపోవాలనే సందేశం లాంటివేమీ ఇవ్వలేదు. 

    పేద, గొప్ప కథను ఎవరు చెప్పినా అందులో పేదవాడు గెలవాలని, సమానత్వం ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ దాన్ని ఎలా చెప్పామనేది ముఖ్యం. నేను గతంలో తీసిన చిత్రాలకు భిన్నంగా ఇలాంటి ఓ కథను రాసి, తెరకెక్కించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నా. అయితే తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించడం వల్ల షూటింగ్‌‌‌‌‌‌‌‌, ఎడిటింగ్‌‌‌‌‌‌‌‌, మిక్సింగ్, సెన్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా అన్నీ రెండు సార్లు చేయాల్సి వచ్చింది. దీంతో ఫస్ట్ కాపీ రెడీ అవడానికి ఎక్కువ సమయం పట్టింది. 

    ధనుష్ విషయంలో..  స్వతహాగా తను దర్శకుడు కావడం, నేను బ్యాడ్ నెరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కావడంతో స్టోరీ చెప్పేటప్పుడు కాస్త భయపడ్డాను. కానీ ఈ పాత్రను తాను తప్ప ఎవరూ పోషించలేరు అనేంత గొప్పగా ధనుష్ నటించారు.  సినిమా చూశాక అందరూ అదేమాట చెబుతారు. ఓ బిచ్చగాడి పాత్రను ఒప్పుకోవడం మొదలు స్లమ్స్‌‌‌‌‌‌‌‌తో సహా లైవ్ లొకేషన్స్‌‌‌‌‌‌‌‌లో షూట్ చేయడం, ఎక్కువ డేస్‌‌‌‌‌‌‌‌ వర్క్ చేయడం వరకూ చాలా కష్టపడ్డాడు. 

    దీపక్ అనే డిఫరెంట్ షేడ్స్ ఉండే పాత్ర రాసుకున్నాక.. నాగార్జున గారు యాప్ట్‌‌‌‌‌‌‌‌ అనిపించింది. అందుకే పట్టుబట్టి ఆయన్ను ఒప్పించా. ఇప్పటివరకూ మనం ఆయనలో చూసిన హీరోయిజం, వావ్ ఫ్యాక్టర్స్‌‌‌‌‌‌‌‌ అన్నీ పక్కనబెట్టి, నా కథకు, ఆ పాత్రకు ఏం కావాలో అది మాత్రమే చూపించాను. రష్మిక కూడా చాలా అద్భుతంగా నటించింది.  ఇక జిమ్‌‌‌‌‌‌‌‌ సర్ఫ్‌‌‌‌‌‌‌‌ పట్టుబట్టి తెలుగు డైలాగ్స్‌‌‌‌‌‌‌‌ నేర్చుకుని డబ్బింగ్ చెప్పాడు. 

    ముంబైలో షూటింగ్ చేయడం చాలా కష్టం. అది మన ఫైనాన్షియల్ క్యాపిటల్ కావడంతో నా కథకు అవసరమై అక్కడ షూట్ చేశాం. ముంబై బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌ అనుకున్నాకే ఇది పాన్ ఇండియాకు సెట్‌‌‌‌‌‌‌‌ అయ్యే సినిమా అని ఫిక్స్ అయ్యాం. అంతే తప్ప బలవంతంగా పాన్‌‌‌‌‌‌‌‌ ఇండియా సినిమా అని ప్రమోట్ చేయడం లేదు. పాన్‌‌‌‌‌‌‌‌ ఇండియా చట్రంలో ఇరుక్కుంటే అనవసరంగా చాలా సమయం వృథా అవుతుంది.  

    ‘కుబేరా’కు సీక్వెల్‌‌‌‌‌‌‌‌ ఆలోచన లేదు. ‘లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ సీక్వెల్‌‌‌‌‌‌‌‌కు కథ రెడీగా ఉంది. కానీ ప్రస్తుత రాజకీయ సమీకరణాలకు ఆ కథ సెట్‌‌‌‌‌‌‌‌ అవ్వదు అనిపిస్తుంది. ముఖ్యంగా నేతల కంటే ప్రజలే ఎక్కువ మారిపోయారు. 

    పాతికేళ్ల నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూసి ఒక్కోసారి ఎమోషన్‌‌‌‌‌‌‌‌ అవుతుంటాను. అప్పుడప్పుడు భలే తీశానే అనే గర్వంగా  కూడా ఉంటుంది. మరోసారి ఇది ప్రేక్షకులు ఇచ్చిన విజయం కదా అనిపిస్తుంది. ఇప్పటికీ అదే పద్మారావు నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సింపుల్‌‌‌‌‌‌‌‌గా ఉండటానికి కారణం నేను పెరిగిన విధానం. దర్శకుడిగా ఈ స్థానం ప్రేక్షకులు ఇచ్చింది కనుక గ్రౌండెడ్‌‌‌‌‌‌‌‌గా ఉండగలుగుతున్నా. వ్యక్తిగా ఎవాల్వ్‌‌‌‌‌‌‌‌ అయ్యాను కానీ ఛేంజ్ అవలేదు. 

నేను ఇప్పటివరకూ ఏ సినిమా చేసినా ఆ కథకు తగ్గట్టుగా వెళ్లాను తప్ప నాకంటూ ప్రత్యేకమైన మార్క్ ఉండాలనుకోలేదు. కానీ నా  సినిమాల్లో చాలామంది  ప్రేమకథ, రొమాన్స్ లాంటివి ఇష్టపడుతుంటారు. అవేమీ ఇందులో ఉండవు.  ముంబై రోడ్లపై తిరిగే ఓ బిచ్చగాడి కథను శేఖర్ కమ్ముల ఎలా తీస్తాడు అన్నదే ఈ సినిమా.  ఈ కథను ఇలా తీశాడా అనే వావ్ ఫ్యాక్టర్ మాత్రం ఉంటుంది.