ప్రాణ స్నేహితుల కథ.. నా సామిరంగ

ప్రాణ స్నేహితుల కథ.. నా సామిరంగ

నాగార్జున గారితో సినిమా చేయడం తన అదృష్టం అంటున్నాడు దర్శకుడు విజయ్ బిన్ని. నాగార్జున హీరోగా తను డైరెక్ట్ చేసిన చిత్రం ‘నా సామిరంగ’. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ బిన్ని మాట్లాడుతూ ‘నాగార్జున గారికి కొన్ని పాటలు కొరియోగ్రఫీ చేసిన నేను, దర్శకుడిగా నా తొలి సినిమాను ఆయనతో చేయడం చాలా హ్యాపీ. ఇదొక ఫ్రెండ్షిప్ స్టోరీ. 

1980–90 బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌లో జరిగే కథ. ప్రాణ స్నేహితులుగా నాగార్జున, అల్లరి నరేష్‌‌‌‌ అద్భుతంగా నటించారు.  మరో కీలకపాత్రకు రాజ్ తరుణ్‌‌‌‌ని తీసుకున్నాం. ఫ్రెండ్షిప్‌‌‌‌తో పాటు లవ్‌‌‌‌స్టోరీ, ఎమోషన్ అందర్నీ ఆకట్టుకుంటాయి. అలాగే చాలా సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌లు ఉంటాయి. ఆస్కార్ అవార్డ్ అందుకున్న తర్వాత కీరవాణి గారు చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో మూడు కూడా బాగుంటాయి. నాలుగు పాటలకు నేనే కొరియోగ్రఫీ చేశా. సినిమా త్వరగా పూర్తవడానికి  నిర్మాత అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు’ అని  చెప్పాడు.