గుర్తుపెట్టుకోండి: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు..వెబ్‌సిరీస్‌లివే

గుర్తుపెట్టుకోండి: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు..వెబ్‌సిరీస్‌లివే

దీపావళికి ఫెస్టివల్కు రిలీజైన సినిమాలున్నీ..ఓ మోస్తరుగా రన్ అవుతుండటంతో..ఆడియన్స్ నవంబరు మూడో వారంలో వచ్చే సినిమాలపై ఆసక్తి చూపుతున్నారు. దీపావళి అంత డబ్బింగ్‌ సినిమాలతోనే గడిచింది. మరి ఈ వారం తెలుగు నుంచి వచ్చే సినిమాలు ఏమున్నాయో తెలుసుకుందాం. అలాగే  రోజు రోజుకు ఓటీటీల్లో కూడా సినిమాల సందడి ఎక్కువవుతోంది. ఈ వారం కూడా చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్నాయి. అవేంటో లుక్కేద్దాం మరి. 

థియేటర్‌లో రిలీజయ్యే సినిమాలు

మంగళవారం 

ఆర్ఎక్స్100 (RX100) మూవీ ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ మంగళవారం (Mangalavaraam). హారర్ అండ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో..పాయల్ రాజ్ పుత్(Payal Rajput) ప్రధాన పాత్రలో నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమా నవంబర్‌ 17న థియేటర్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్‌ కాబోతుంది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్‌,టీజర్ సాంగ్స్ రిలీజ్ అవ్వడంతో..జనాల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు అసలు మంగళవారం రాగానే ఊరిలో జరిగే హత్యలను..ఎవరు చేశారు? అనే ప్రశ్నలతో ట్రైలర్ లో చూపించిన తీరు ఇంటెన్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా పై కూడా ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మై నేమ్ ఈజ్ శ్రుతి

సినీ ప్రియుల్ని థ్రిల్‌ చేసేందుకు సిద్ధమవుతోంది నటి హన్సిక. ఆర్గాన్ మాఫియా బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో శ్రీనివాస్ ఓంకార్ రూపొందిస్తున్నారు. బురుగు రమ్య ప్రభాకర్ నిర్మాత. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్‌‌‌‌, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఊహకందని మలుపులతో సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో తన మనోభావాలను ధైర్యంగా వెల్లడించే యువతిగా హన్సిక కనిపిస్తుంది.  

ఈ మూవీలో  మురళీశర్మ, ‘ఆడుకాలం’ నరేన్, జయప్రకాష్, సీవీఎల్ నరసింహారావు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నవంబర్ 17న థియేటర్లో రిలీజ్ చేయనున్నారు.

స్పార్క్ L.I.F.E 

విక్రాంత్(Vikranth) హీరోగా..మెహరీన్(Mehreen), రుక్సార్ (Rukshar) లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ స్పార్క్ L.I.F.E (Spark). ఈ సినిమాతో హీరో విక్రాంత్ పరిచయం అవుతుండడంతో పాటు..డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. 

లవ్ స్టోరీ..కాస్తా క్రైమ్ యాంగిల్ లోకి మారడం..ఒక అమ్మాయి తర్వాత మరొక అమ్మాయి వరుసగా హత్యలకు గురవ్వడం వంటి థ్రిల్లింగ్  సీన్స్ తో ట్రైలర్ తోనే ఆసక్తి కలిగించారు మేకర్స్. ఈ మూవీ నవంబర్ 17న థియేటర్లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.  

'సప్త సాగరాలు దాటి’ సైడ్ బి 

కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా హేమంత్ ఎ.రావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సప్త సాగరాలు దాటి’ సైడ్ ఎ పేరుతో రీసెంట్‌‌‌‌‌‌‌‌గా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడిదే చిత్రానికి కొనసాగింపుగా 'సప్త సాగరాలు దాటి’ సైడ్ బి విడుదల కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో ప్రేక్షకులకు ముందుకు రానుంది.

అన్వేషి

విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్య నాగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ళ్ల హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘అన్వేషి’.  వి.జె.ఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నా ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్శక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్వంలో టి.గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తి రెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఫారెస్ట్ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నడిచే సినిమా ఇది. అనన్య నాగళ్ల పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది..ఆమె చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని మేకర్స్ వెల్లడించారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించిన ఈ సినిమా నవంబరు 17న థియేటర్లో రిలీజ్ కానుంది. 

ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు /వెబ్‌సిరీస్‌లివే

 

డిస్నీ+హాట్‌స్టార్‌

ఎ మర్డర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ (సిరీస్) - (డిస్నీ+ హాట్‌స్టార్) నవంబర్ 14

చిన్నా (తమిళ/తెలుగు) నవంబరు 17

అపూర్వ  - (డిస్నీ+ హాట్‌స్టార్) నవంబర్ 15న 
కన్నూర్‌ స్క్వాడ్‌ (మలయాళం) నవంబరు 17

 

అమెజాన్‌ ప్రైమ్‌

ట్విన్‌ లవ్‌ (హాలీవుడ్‌) నవంబరు 17

నెట్‌ఫ్లిక్స్

హౌటూ బికమ్‌ ఏ మాబ్‌ బాస్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 14
బెస్ట్‌ క్రిస్మస్‌ ఎవర్‌ (హాలీవుడ్‌) నవంబరు 16
ది క్రౌన్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 16
క్రౌన్ సీజన్ 6 పార్ట్ 1 - (నెట్‌ఫ్లిక్స్) నవంబర్ 16న 
బెస్ట్ క్రిస్మస్ . ఎవర్ (నెట్‌ఫ్లిక్స్) నవంబర్ 16న 
బిలీవర్‌2 (కొరియన్‌) నవంబరు 17
ది డాడ్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 17
రస్టిన్ - నెట్‌ఫ్లిక్స్ నవంబర్ 17న 
సుఖీ (హిందీ) నవంబరు 17
రైల్వే మెన్ (సిరీస్) - నెట్‌ఫ్లిక్స్ నవంబర్ 18న 

బుక్‌ మై షో

రాంగ్‌ ప్లేస్‌ (హాలీవుడ్)నవంబరు 12
ది ఎగ్జార్సిస్ట్‌ (హాలీవుడ్‌) నవంబరు 17

జియో సినిమా

ది ఫ్లాష్‌ (తెలుగు) నవంబరు 15

ఆపిల్‌ టీవీ ప్లస్‌

మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ (సిరీస్) - Apple TV నవంబర్ 17న 
స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ (రియాలిటీ సిరీస్) - నెట్‌ఫ్లిక్స్ నవంబర్ 22న 
ఫ్యామిలీ స్విచ్ (నెట్‌ఫ్లిక్స్) నవంబర్ 30