బేగంపేట్లో భారీగా ట్రాఫిక్ జామ్

బేగంపేట్లో భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ బేగంపేట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్యారడైజ్ నుంచి ఐటీసీ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే ఉద్యోగస్తులు, స్కూల్స్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆఫీసులకు ఆలస్యంగా వెళ్లడంతో ఎంప్లాయిస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ట్రాఫిక్ సమస్య వల్ల లేట్ అవుతుందని ఆవేదన చెందుతున్నారు.

బేగంపేట్ మెట్రో దగ్గర ప్రోగ్రెస్ లో రోడ్ వర్క్ కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నగరంలో ఎక్కడ ఏ చిన్న రోడ్డు వర్క్ జరిగినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. కిలోమీటర్ వెళ్లాలంటే గంట సమయం పడుతోంది. వర్క్ జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ను సమస్య లేకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.