సమ్మెపై వెనక్కి తగ్గేది లేదు

సమ్మెపై వెనక్కి తగ్గేది లేదు

ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాలతో భేటీ అయింది ప్రభుత్వం నియమించిన కమిటీ.  అయితే ఏమీ తేల్చకుండానే చర్చలు ముగిశాయి. తమపై నమ్మకముంచాలన్న అధికారుల విజ్ఞప్తిని తిరస్కరించారు కార్మిక సంఘాల నేతలు. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. కార్మిక సమస్యలపై ఎలాంటి హామీ ఇవ్వకుండా.. సమ్మె చేయొద్దని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. తమ సమస్యలను సానుకూలంగా ఆలోచించాలని కోరిన నేతలు… తప్పని పరిస్థితిల్లోనే సమ్మెకు వెళ్తామన్నారు.