ఈ 3 రాశుల వాళ్ళు మాట్లాడితే చాలు, ఏడుస్తు ఉన్నోళ్ల మొఖంలో కూడా నవ్వు వస్తుంది!

 ఈ 3  రాశుల వాళ్ళు మాట్లాడితే చాలు, ఏడుస్తు ఉన్నోళ్ల  మొఖంలో కూడా నవ్వు వస్తుంది!

మనందరి జీవితాల్లో మాటలు కీలక పాత్ర పోషిస్తాయి. కొన్నిసార్లు ఒక్క కఠినమైన మాట రోజంతా మన మూడ్‌ను పాడుచేస్తుంది.  అదే ఎవరైనా  ప్రేమగా మాట్లాడే ఒక్క మంచి మాట.. మన గుండెల్లోని భాధను, లోతైన గాయాలను కూడా క్షణాల్లో మాయం చేస్తుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 12 రాశులలో ప్రతిరాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే, ఈ మూడు రాశుల వారి మాటతీరు లేదా వారు మాట్లాడే విధానం, నిజంగా ఒక మాయలా లేదా  చక్కని ఓదార్పులా ఉంటుంది.

వాళ్ళు మాట్లాడే తీరు ఎంత బాగుంటుందంటే, కన్నీళ్లతో ఏడుస్తున్న వాళ్ళ ముఖంలో కూడా ఇట్టే చిరునవ్వు తెప్పిస్తారు.  వాళ్ళ మాటలతో, వారు సమాజంలో వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకుంటారు. తియ్యటి మాటలతో అందరి మనసుల్ని గెలుచుకునే ఆ అదృష్ట రాశుల  గురించి వివరంగా తెలుసుకుందాం.......

1. తులారాశి (Libra)
తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్య శాస్త్రంలో, శుక్రుడిని కళ, ఆకర్షణ, సృజనాత్మకతకు ప్రతీకగా పరిగణిస్తారు. అందుకే తులారాశి వారి మాటల్లో ఒక ప్రత్యేకమైన మాధుర్యం, సృజనాత్మకత ఉంటాయి. ఎవరైనా తీవ్ర దుఃఖంలో ఉన్నప్పుడు, తులారాశి వారు వాళ్ళ మధురమైన మాటలతో పరిస్థితిని సులభంగా తేలికపరచగలరు. మాటల ద్వారా  బాధలను తగ్గించే స్కిల్స్  వీరికి ఉంటుంది.

2. ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశికి అధిపతి దేవతల గురువైన బృహస్పతి. బృహస్పతిని జ్ఞానం, విద్య, వివేకానికి ప్రతీకగా భావిస్తారు. అందువల్ల, ధనుస్సు రాశి వారు ఎప్పుడూ ఆలోచించకుండా మాట్లాడరు. వాళ్ళ మాటలను ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో వారికి కచ్చితంగా తెలుసు. వారి మాటలు ఎంత లోతైనవి, వివేకవంతమైనవి అంటే, అవి ఎంతగా కుంగిపోయిన వ్యక్తిని అయినా నవ్వించగలవు.  దుఃఖంలో మునిగిపోయిన వారిని కూడా వారి బాధ నుండి బయటపడేయగలరు.

3. మీన రాశి (Pisces)
మీన రాశి వారు దేవతల గురువైన గురు గ్రహం చేత కూడా ప్రభావితమవుతారు . ఈ రాశిలో జన్మించిన వారు సహజంగానే చాలా నిస్వార్థపరులు, భావోద్వేగాలతో ఉంటారు. మీన రాశి వారి అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, వారి మాటలకు ఇతరులను బాధల నుండి బయటికి వచ్చేలా చేసే అద్భుతమైన శక్తి ఉంటుంది. వీరు ఎవరితోనైనా మాట్లాడితే చాలు, వాళ్ళ  సగం బాధ తీరిపోయిందని అవతలి వారు భావిస్తారు. ఆప్యాయంగా పలకరించి, దిగులుగా ఉన్న వారి మొఖంలో చిరునవ్వు తెప్పించడంలో వీరు దిట్ట.

ALSO READ : వెరైటీ బ్రేక్ ఫాస్ట్: సూపర్ టేస్ట్.. హెల్దీఫుడ్.. ఎగ్ ఇడ్లీ..

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.