జ్యోతిష్యం : ఈ 5 రాశుల వారికి కోపం ఎక్కువ.. తప్పు అని చెబితే భరించలేరు.. ఒప్పుకోలేరు..!

జ్యోతిష్యం : ఈ 5 రాశుల వారికి కోపం ఎక్కువ.. తప్పు అని చెబితే భరించలేరు.. ఒప్పుకోలేరు..!

మనుషులపై గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది.. ఏయే రాశుల వాళ్లు ఎలా ప్రవర్తిస్తారు.. ఏ రాశుల వాళ్లు.. వాళ్లకు వాళ్లు తెలివైన వాళ్లుగా.. తప్పు చేయని వాళ్లుగా ప్రవర్తిస్తారు.. ఏ రాశుల వాళ్లకు వాళ్లు చేసింది తప్పు అని చెబితే కోపం వస్తుంది.. తప్పు అని చెబితే జీర్ణించుకోలేరు అనే విషయాలను.. జ్యోతిష్యం ఆధారంగా వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 12 రాశుల్లో 5 రాశుల వాళ్లు తప్పు అని చెబితే జీర్ణించుకోలేరు.. ఆ విషయాన్ని లైట్ గా తీసుకోరు. లోతైన విశ్లేషణ.. మేం చేస్తున్నది నిజం.. ఇది ఇలాగే ఉంటుంది అనే మితిమీరిన ఆత్మ విశ్వాసంతో ఉంటారు వీళ్లు. అలాంటి 5 రాశుల వివరాలు.. జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా తెలుసుకుందాం..

మేష రాశి :
ధైర్యంగా ఉంటారు. ప్రతి విషయాన్ని ఇష్టంగా తీసుకుంటారు. అప్పటికప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఎవరైనా సవాల్ చేస్తే లైట్ గా తీసుకునే మనస్తత్వం కాదు వీళ్లది. జోక్ గా సవాల్ చేసినా సీరియస్ గా తీసుకుంటారు వీళ్లు. ఇది తప్పు అని చెబితే.. కాదు ఇదే నిజం అని వాదనకు దిగుతారు. తప్పు చేశామని తెలిసినా సమర్థించుకోవటానికి ఎంకైనా వెళతారు. ఎదుటి వాళ్లను తమ నియంత్రణలోకి తీసుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. తప్పు అని చెబితే జీర్ణించుకోవటం వీళ్లకు కష్టం. 

వృషభ రాశి  :
వీరు చాలా మొండిగా, కఠినంగా ఉంటారు. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటారు. ఎవరైనా సలహా ఇచ్చినా లేదా విమర్శించినా వ్యక్తిగతంగా అవమానించినట్లు భావిస్తారు. వీరు ఎప్పుడూ వాళ్ళ నిర్ణయాలు తెలివైనవని నమ్ముతారు. అందుకే వీరితో గొడవ పడటం కంటే.. ఓపికగా చెప్పడమే మంచిది.

సింహ రాశి  :
వీరికి గౌరవం, గుర్తింపు అంటే చాలా ఇష్టం. వాళ్ళు చేసేది తప్పని ఎవరైనా అంటే అస్సలు భరించలేరు. వాళ్ళ  తప్పును కప్పిపుచ్చుకోవడానికి గంటలు గంటలుగా  వాదిస్తారు. వీరిలో గర్వం ఎక్కువ. తప్పును ఒప్పుకోవడం అస్సలు చేయరు.

వృశ్చిక రాశి  :
వీరు ప్రతి విషయాన్ని గమనిస్తారు. వీరి తప్పును ఎవరైనా ఎత్తి చూపితే వెంటనే సేఫ్ సైడ్ అయిపోతారు  లేదా సైలెంట్‌గా ఉండి పగ పెంచుకుంటారు. వీరి దృష్టిలో వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనిపించుకోవడం ఒక గొప్ప లాంటిది. ఆ గోప్పతనం కోల్పోవడానికి వీరు ఇష్టపడరు.

ధనుస్సు రాశి  :
వీరికి వాళ్ళ పై వాళ్ళకి నమ్మకం చాలా ఎక్కువ. ఏదైనా విషయంలో ఛాలెంజ్ చేస్తే అస్సలు వెనక్కి తగ్గరు. ఒక్కోసారి తప్పును కప్పిపుచ్చుకోవడానికి జోకులు వేస్తారు, మరికొన్ని సార్లు ఉత్సాహంగా వాదిస్తారు. వీరికి గెలవడం కంటే  చర్చలో ఉండే థ్రిల్ అంటేనే ఎక్కువ ఇష్టం.

అందరు ఒకేలా ఉండరు.. ప్రతి మనిషి వేరుగా ఉంటారు. కానీ జ్యోతిష్యం ప్రకారం ఎదుటివారి మనస్తత్వం ఏంటో ముందుగానే తెలిస్తే, అనవసరమైన గొడవలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. కొంచెం ఓపిక, కొంచెం ఆలోచన ఉంటే ఎలాంటి వారినైనా ఒప్పించవచ్చు.

 Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.