అనూప్ రూబెన్స్ చేతుల మీదుగా 'ముగ్గురు కోతులు' క్రేజీ మెలోడీ లాంచ్

అనూప్ రూబెన్స్ చేతుల మీదుగా 'ముగ్గురు కోతులు' క్రేజీ మెలోడీ లాంచ్

థియేటర్లలో నవ్వులు పూయించేందుకు 'ముగ్గురు కోతులు' మూవీ సిద్ధమవుతోంది. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహిస్తున్నారు. తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, వర్షిక పాశం కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ ట్రాక్ సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందాయి.

ఈ జోష్‌ను మరింత పెంచుతూ.. ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ చేతుల మీదుగా 'తిడుతున్నా కొడుతున్నా' అనే స్వీట్ రొమాంటిక్ మెలోడీ సాంగ్ లాంచ్ చేశారు మేకర్స్. పాట ట్యూన్ చాలా క్యాచీగా ఉందని కొనియాడిన అనూప్, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్. సుహాస్ అందించిన ఈ మెలోడీకి జగదీష్ ఆకట్టుకునే సాహిత్యం అందించగా, చైతన్య, లాస్య తమ గాత్రంతో ప్రాణం పోశారు.

లిరికల్ వీడియోలో హీరో, హీరోయిన్ల మధ్య సాగే క్యూట్ లవ్ ట్రాక్, ప్లెజెంట్ విజువల్స్ యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉన్న ఈ చిత్రానికి రాజ్ నోముల ఛాయాగ్రహణం, జమీర్ షేక్ ఎడిటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

►ALSO READ | కృష్ణుడి పాత్ర కోసం రామ్ చరణ్, విజయ్ దేవరకొండ మధ్య పోటీ? ఆటో డ్రైవర్ గా అల్లు అర్జున్..? హాట్ టాపిక్‌గా 'లాలో' రీమేక్!

అల్లరి, వినోదం,మనసును తాకే ప్రేమకథతో అలరించేందుకు వస్తున్న ఈ 'ముగ్గురు కోతులు' వెండితెరపై ఎలాంటి హంగామా సృష్టిస్తారో వేచి చూడాలి. త్వరలోనే మరిన్ని క్రేజీ అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.