ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా–ఆర్డినరీ మ్యాన్‌‌‌‌‌‌‌‌ నుంచి థర్డ్ సాంగ్ రిలీజ్

ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా–ఆర్డినరీ మ్యాన్‌‌‌‌‌‌‌‌ నుంచి థర్డ్ సాంగ్ రిలీజ్

నితిన్, శ్రీలీల జంటగా  వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా–ఆర్డినరీ మ్యాన్‌‌‌‌‌‌‌‌’. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 8న విడుదలవుతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు రెండు పాటలు రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు మేకర్స్. శనివారం ‘ఓలే ఓలే పాపాయి..’  అంటూ సాగే థర్డ్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.  

హ్యారిస్ జైరాజ్ కంపోజ్ చేసిన పాటకు కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ రాయగా, రామ్ మిరియాల, ప్రియా హేమెస్ పాడిన విధానం ఇంప్రెస్ చేస్తోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో నితిన్ మాట్లాడుతూ ‘పాటలతో పాటు ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రేక్షకులకు ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇస్తుంది.  నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో చేసిన సినిమాల్లో ఇది బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. 

ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు ప్రతిరోజూ ఎంజాయ్ చేశా. నాతో పాటు టీమ్‌‌‌‌‌‌‌‌కి, ప్రేక్షకులకు ఈ సినిమా గుర్తుండిపోతుంది’ అని చెప్పాడు.  వక్కంతం వంశీ మాట్లాడుతూ ‘ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్. ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పదింతల కామెడీ సినిమాలో ఉంటుంది’ అని  చెప్పారు. టైటిల్‌‌‌‌‌‌‌‌కి తగ్గట్టు, ప్రేక్షకుల అంచనాలకు ధీటుగా సినిమా ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రార్డినరీగా ఉంటుందని నిర్మాత సుధాకర్ రెడ్డి అన్నారు.