సమ్మర్ సీజన్‌‌లో ఇంట్లో ఈ ఐస్‌‌ క్రషర్‌‌‌‌ ఉంటే చాలు !

సమ్మర్ సీజన్‌‌లో ఇంట్లో ఈ ఐస్‌‌ క్రషర్‌‌‌‌ ఉంటే చాలు !

సమ్మర్ సీజన్‌‌లో ఇంట్లో రిఫ్రెషింగ్ డ్రింక్స్, ఐస్ గోలా, స్నో కోన్స్, కాక్‌‌టైల్స్ లాంటివి చేసుకుంటుంటారు. వాటిలో సాధారణంగా క్రష్డ్‌‌ ఐస్‌‌ వేస్తుంటారు. అలాంటప్పుడు ఐస్‌‌ క్రష్‌‌ చేసేందుకు ఈ టూల్​ని వాడితే పని ఈజీ అవుతుంది. దీన్ని జెనొవియా అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తీసుకొచ్చింది. దీనికి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు.

ఇది హ్యాండ్ క్రాంక్‌‌తో పని చేసే పోర్టబుల్ క్రషర్. ఇందులో ఐస్ బ్లాక్ పెట్టి హ్యాండిల్ తిప్పితే సాఫ్ట్, ఫ్లఫీ క్రష్డ్ ఐస్ వస్తుంది. ఇది కాంపాక్ట్ సైజులో ఉంటుంది కాబట్టి పిక్నిక్, క్యాంపింగ్, హౌస్ పార్టీలు, అవుట్‌‌డోర్ గ్యాదరింగ్స్కు తీసుకెళ్లేందుకు చాలా అనువైనది. హై-క్వాలిటీ ఫుడ్-గ్రేడ్ బీపీఏ ఫ్రీ మెటీరియల్‌‌తో తయారైంది. ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.