జేబులో కూడా ఈజీగా ఇమిడిపోయే రెయిన్‌‌కోట్‌ ఈ రెయిన్ బాల్

జేబులో కూడా ఈజీగా ఇమిడిపోయే రెయిన్‌‌కోట్‌ ఈ రెయిన్ బాల్

అకస్మాత్తుగా వర్షం వస్తే వెంటనే ఉపయోగించుకునేందుకు డిస్పోజబుల్​ రెయిన్​ బాల్​ అండ్ రీఫిల్​ రెయిన్ కార్డ్​ ఎంతో ఉపయోగపడుతుంది. జేబులో కూడా ఈజీగా ఇమిడిపోయేంత చిన్న పరిమాణంలో ఉండే ఈ రెయిన్‌‌కోట్‌‌ను అవసరమైనప్పుడు మాత్రమే తెరిచి ధరించొచ్చు. 

ప్యాక్‌‌లో రెండు డిస్పోజబుల్ రెయిన్ బాల్స్‌‌తో పాటు మూడు రీఫిల్ రెయిన్ కార్డులు వస్తాయి. పలుచని వాటర్‌‌ప్రూఫ్ ప్లాస్టిక్‌‌తో తయారైన ఈ రెయిన్‌‌కోట్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం వరకు శరీరాన్ని తడవకుండా కాపాడుతుంది.

ఫ్రీ సైజ్‌‌లో ఉండటంతో మహిళలు, పురుషులు ఇద్దరూ సులభంగా ధరించొచ్చు. ఒక్కసారి వాడేసి పారేయాల్సిన అవసరం లేకుండా, జాగ్రత్తగా వాడితే రెండు నుంచి మూడు సార్లు తిరిగి ఉపయోగించుకోవచ్చు.

ప్రయాణాలు, బైక్ రైడింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్, ఆఫీస్‌‌కు వెళ్లేవారు లేదా ఎప్పుడైనా వర్షం పడే అవకాశం ఉన్న రోజుల్లో బ్యాగ్‌‌లో తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన అత్యవసర రక్షణ వస్తువుగా ఇది పనికొస్తుంది.