OTT Releases: థియటర్స్కు ధీటుగా ఓటీటీ మూవీస్.. జూన్26, 27 తేదీలలో 20కి పైగా సినిమాలు..

OTT Releases: థియటర్స్కు ధీటుగా ఓటీటీ మూవీస్.. జూన్26, 27 తేదీలలో 20కి పైగా సినిమాలు..

ఈ శుక్రవారం (2025 జూన్ 27న) థియేటర్లలో ప్రేక్షకుల సందడి గట్టిగానే ఉండనుంది. భారీ అంచనాల మధ్య రిలీజయ్యే సినిమాలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన భక్తిరస చిత్రం కన్నప్పతో పాటు తెలుగు డబ్డ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'మార్గన్', బాలీవుడ్ నుంచి హారర్ థ్రిల్లర్ 'MAA'సినిమాలు రానున్నాయి. ఇప్పటికే, ఈ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎగబడి మరి టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఓటీటీ సైతం తన దూకుడు పెంచింది. థియటర్స్కు ధీటుగా (జూన్26,27 తేదీలలో) అదిరిపోయే సినిమాలు తీసుకొస్తుంది. ఇందులో డిఫెరెంట్ జోనర్స్లో సినిమాలు, సిరీస్లు ఉన్నాయి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, యాక్షన్ డ్రామా, కోర్ట్ రూమ్ డ్రామా వంటి జోనర్స్లో సినిమాలు స్ట్రీమింగ్కి అందుబాటులోకి వచ్చాయి. మరి ఆ ఇంట్రెస్టింగ్ సినిమాలేంటీ? అవెక్కడ స్ట్రీమింగ్ అవ్వనున్నాయి? అనే వివరాలు చూసేద్దాం. 

నెట్‌ఫ్లిక్స్:

రైడ్ 2 (హిందీ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్)- జూన్ 26

పింటు పింటు సుర్గా (ఇండోనేషియన్ డ్రామా)- జూన్ 26

స్క్విడ్ గేమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27

సన్ నెక్ట్స్:

ది వర్డిక్ట్ (తమిళ మిస్టరీ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా)- జూన్ 26

అజాదీ (మలయాళం క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్)- జూన్ 27

ఒక పథకం ప్రకారం (తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్)- జూన్ 27

జీ5:

విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ (తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27

బిబీషణ్ (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27

అట తంబైచ నాయ్! (మరాఠీ ఫ్యామిలీ డ్రామా)- జూన్ 28

జియో హాట్‌స్టార్:

స్కార్స్ ఆఫ్ బ్యూటీ (ఇంగ్లీష్ రొమాంటిక్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

ద బేర్ సీజన్ 4 (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

మిస్ట్రీ (హిందీ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27

ది బ్రూటలిస్ట్ (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా)- జూన్ 28

బుక్ మై షో:

అల్ఫా (ఫ్రెంచ్ హారర్ డ్రామా)- జూన్ 24

ద బ్రేకప్ క్లబ్ (డచ్ కామెడీ డ్రామా)- జూన్ 24

రక్తబీజ్ (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్)- జూన్ 26

హంగామా:

బ్యాడాస్ బేగమ్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ రివేంజ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

ఆపిల్ ప్లస్ టీవీ:

స్మోక్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 27

ఈ మూవీస్లో  'ఒక పథకం ప్రకారం, విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్, రైడ్ 2, స్క్విడ్ గేమ్ సీజన్ 3 వంటి సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే రక్తబీజ్, ది బ్రూటలిస్ట్, ఐరన్ హార్ట్, మిస్ట్రీ, బిభీషన్, అల్ఫా, అజాద్ వంటి సినిమాలు సైతం ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. ముఖ్యంగా రైడ్ 2 మూవీ థియేటర్స్లో రిలీజై బాక్సాఫీస్ వద్ద రూ.240 కోట్లకి పైగా వసూళ్లు చేసింది. సస్పెన్స్ క్రియేట్ చేస్తూ సాగే రైడ్ సీన్స్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఏ మాత్రం మిస్ అవ్వకుండా వీకెండ్ ఎంజాయ్ చేసేయండి.