
సంక్రాంతి పండుగ ముగిసింది కానీ, పండుగకు వచ్చిన సినిమాలు మాత్రం ఇంకా ఆడియన్స్ ను అలరిస్తూనే ఉన్నాయి. అందులో హనుమాన్ సినిమా ఒకటి. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా జోరు ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు.
ఇదిలా ఉంటే.. మరోపక్క ఓటీటీ సంస్థలు సైతం ప్రతీ వారం కొత్త కంటెంట్ ని ఆడియన్స్ కోసం తీసుకొస్తూనే ఉంది. అందులో భాగంగానే ఈ వారం కూడా సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఓటీటీ సంస్థలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి ఆ డీటెయిల్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్:
- జనవరి 23: కెవిన్ జేమ్స్: ఇర్ రిగార్డ్లెస్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ),
- జనవరి 24: హస్లర్స్ (హిందీ సిరీస్)
- జనవరి 25: కజిమ్యాన్ (ఇండోనేసియన్ సినిమా)
- జనవరి 26: ఎక్స్పాట్స్ (ఇంగ్లీష్ సిరీస్), పంచాయత్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్)
నెట్ఫ్లిక్స్:
- జనవరి 22: నాట్ క్వైట్ నర్వాల్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)
- జనవరి 23: జాక్వెలిన్ నోవాక్: గెట్ ఆన్ యూవర్ నీస్ (ఇంగ్లీష్ సినిమా),లవ్ డెడ్లైన్ (జపనీస్ సిరీస్)
- జనవరి 24: గ్రీసెల్డా (ఇంగ్లీష్ సిరీస్),క్వీర్ ఐ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్),సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ (ఇంగ్లీష్ సిరీస్)
- జనవరి 25: బూగీమన్ (అరబిక్ మూవీ),మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్),
- జనవరి 26: బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ (కొరియన్ చిత్రం)
- జనవరి 28: క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2 (హిందీ సిరీస్)
హాట్స్టార్:
- జనవరి 23 నెరు (తెలుగు డబ్బింగ్ చిత్రం)
- జనవరి 24: ఏ రియల్ బగ్స్ లైఫ్ (ఇంగ్లీష్ సిరీస్)
- జనవరి 26: ఫ్లెక్స్ X కాప్ (కొరియన్ సిరీస్),కర్మ కాలింగ్ (హిందీ సిరీస్)
- జనవరి 27: ఫైట్ క్లబ్ (తమిళ సినిమా)
జీ5:
- జనవరి 26: సామ్ బహుదూర్ (హిందీ సినిమా)
సోనీ లివ్:
- జనవరి 22: షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3 (హిందీ సిరీస్)
జియో సినిమా:
- జనవరి 22: మై బిగ్ ఫాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా)