
శుక్రవారం వచ్చిందంటే చాలు ఆడియన్స్ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. వీక్ అంతా కష్టపడి.. వీకెండ్స్ లో సినిమాలు చూసి రిలాక్స్ అవుతూ ఉంటారు. ఒకప్పుడు సినిమాలంటే థియేటర్స్ మాత్రమే ఉండేవి.. ఇప్పుడు వాటి స్థానం ఓటీటీలు వచ్చి చేరాయి. థియేటర్స్ కు సైతం పోటీగా కొత్త కొత్త కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ప్రతీ వారంలాగే ఈ వారం కూడా సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి ఓటీటీ సంస్థలు. వాటిలో థియేట్రికల్ రన్ ముగించుకున్న సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఏ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనేది ఇపుడు తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్:
- ఫిబ్రవరి 05: డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ (యానిమేషన్ సిరీస్), ఆక్వామాన్ అండ్ ది లిస్ట్ కింగ్‌డమ్, మాంక్ సీజన్స్(అమెరికన్ సిరీస్),మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్(కిడ్స్ సిరీస్), ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్(అమెరికన్ సిరీస్)
- ఫిబ్రవరి 07: లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ (బ్రెజిలియన్ కిడ్స్ సిరీస్), రైల్: ది లాస్ట్ ప్రొఫెట్(డాక్యుమెంటరీ సిరీస్), లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 -పార్ట్ 2
- ఫిబ్రవరి 08: వన్ డే (వెబ్ సిరీస్)
- ఫిబ్రవరి 09: గుంటూరు కారం(తెలుగు), భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్ ), లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్),యాషెస్ ( టర్కీ సిరీస్),ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్), ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)
- ఫిబ్రవరి 10: హారిబుల్ బాసెస్
- ఫిబ్రవరి 11: బ్లాక్‌లిస్ట్ సీజన్ 10
డిస్నీప్లస్ హాట్ స్టార్:
- ఫిబ్రవరి 09: ఆర్య: అంతిమ్ వార్ సీజన్3
జీ5:
- ఫిబ్రవరి 09: కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)
అమెజాన్ ప్రైమ్:
- ఫిబ్రవరి 09: కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)