OTT లవర్స్కి పండగే.. ఈవారం ఏకంగా 29 సినిమాలు

OTT లవర్స్కి పండగే.. ఈవారం ఏకంగా 29 సినిమాలు

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి హంగామా నడుస్తోంది. ఈ సంవత్సరం ఏకంగా నాలుగు బడా సినిమాలు సంక్రాంతి వార్ కు సిద్ధమయ్యాయి. అందులో మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ, తేజ సజ్జ హనుమాన్ సినిమాలు ఉన్నాయి. దీంతో ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ భారీగా జరుగనుందని తెలుస్తోంది. 

ఇక థియేటర్స్ లోనే కాదు ఓటీటీ సంస్తలు కూడా ఈ పండక్కి ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. కొత్త కొత్త కంటెంట్ ను ఆడియన్స్ ముందుకు తెస్తున్నాయి. ఇందులో భాగంగా ఈవారం ఏకంగా 29 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఆ డీటెయిల్స్ ఏంటి? ఏ ఏ మూవీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? అనేది తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్:

  • జనవరి 11: మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ), 90 హరి మెంకారి సువామి (ఇండోనేసియన్ సినిమా),  
  • జనవరి 12: రోల్ ప్లే (ఇంగ్లీష్ సినిమా) 

నెట్‌ఫ్లిక్స్: 

  • జనవరి 08: ఐర్ మతా దీ ఉజుంగ్ సజదా (ఇండోనేసియన్ సినిమా)
  • జనవరి 09: డైరీస్ సీజన్ 2 పార్ట్ 2 (ఇటాలియన్ సిరీస్), పీట్ డేవిడ్‌సన్: టర్బో ఫంజరెల్లి (ఇంగ్లీష్ మూవీ)
  • జనవరి 10: క్ పాయింట్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్), కింగ్‌డమ్ 3: ద ఫ్లేమ్ ఆఫ్ ఫేట్ (జపనీస్ సినిమా), ద ట్రస్ట్: ఏ గేమ్ ఆఫ్ గ్రీడ్ (ఇంగ్లీష్ సిరీస్)
  • జనవరి 11: బాయ్ స్వాలోస్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్), ఛాంపియన్ (ఇంగ్లీష్ సిరీస్), డిటెక్టివ్ ఫోస్ట్ (పోలిష్ సిరీస్), కిల్లర్ సూప్ (హిందీ సిరీస్), మంత్ర సురుగణ (ఇండోనేసియన్ చిత్రం), సోనిక్ ప్రైమ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్)
  • జనవరి 12: ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ (తెలుగు మూవీ), అడిరే (ఇంగ్లీష్ సినిమా), లిఫ్ట్ (ఇంగ్లీష్ మూవీ), లవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ (స్వీడిష్ సిరీస్),
  • జనవరి 13: డంబ్ మనీ (ఇంగ్లీష్ సినిమా)

హాట్‌స్టార్:

  • జనవరి 11: ఎకో (ఇంగ్లీష్ సిరీస్)
  • జనవరి 12: ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) 

సోనీ లివ్:

  • జనవరి 10: జియో సినిమా లా బ్రియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్), ఆపిల్ ప్లస్ టీవీ క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్) 
  • జనవరి 12: చేరన్స్ జర్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్), టెడ్ (ఇంగ్లీష్ సిరీస్)

 
జీ5:

  • జనవరి 12: అజయ్ గాడు (తెలుగు సినిమా)

బుక్ మై షో:

  • జనవరి 09: జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆన్ ఇన్ఫైనిట్ ఎర్త్ (ఇంగ్లీష్ సినిమా), వన్ మోర్ షాట్ (ఇంగ్లీష్ మూవీ)