ఈ వీకెండ్ థియేటర్లలో కొత్త సినిమాల సందడి మొదలైంది. విజయ్ దేవరకొండ ‘రణబాలి’, రజినీకాంత్ ‘జైలర్ 2’, అఖిల్ నటించిన ‘క్రేజీ కళ్యాణం’, ‘గరివిడి లక్ష్మి’ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మరోవైపు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సైతం సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్, హారర్, రొమాన్స్, కామెడీతో పాటు డాక్యుమెంటరీలు, రియాలిటీ షోలు.. ఇలా విభిన్న జానర్లకు చెందిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఈ వారం స్ట్రీమింగ్కు అందుబాటులో ఉన్నాయి. మరి ఏ ఓటీటీలో ఏ సినిమా, ఏ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం..
నెట్‌ఫ్లిక్స్:
ది ట్రాప్ – తెలుగు డబ్బింగ్ జర్మన్ సైకలాజికల్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ – అక్టోబర్ 13
టైసన్ – ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్ – అక్టోబర్ 13
హంటింగ్ గ్యారీ గ్లిట్టర్ – ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ – అక్టోబర్ 14
లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 11 – ఇంగ్లీష్ డేటింగ్ రియాలిటీ షో – అక్టోబర్ 14
సుముఖి సురేష్: హోయిమోనల్ – హిందీ స్టాండప్ కామెడీ షో – అక్టోబర్ 14
ఎన్న విలై: ది ప్రైస్ ఆఫ్ డిగ్నిటీ – తెలుగు డబ్బింగ్ తమిళ సోషల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా – అక్టోబర్ 15
హాలీవుడ్ ఆర్ట్స్ – ఇంగ్లీష్ టీనేజ్ మ్యూజికల్ కామెడీ డ్రామా వెబ్‌సిరీస్ – అక్టోబర్ 15
ది డిప్లమాట్ సీజన్ 4 – ఇంగ్లీష్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్‌సిరీస్ – అక్టోబర్ 15
ది స్టోర్మ్ – స్వీడిష్ డార్క్ కామెడీ సినిమా – అక్టోబర్ 15
మనీట్రాప్: ది కరుణ్ ట్రెజర్ – టర్కిష్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ కామెడీ వెబ్‌సిరీస్ – అక్టోబర్ 16
డ్రాగన్ బాల్ సూపర్: బీరస్ – ఇంగ్లీష్ యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ సిరీస్ – అక్టోబర్ 16
సీరియస్లీ సింగిల్ టూ – ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ సినిమా – అక్టోబర్ 16
డ్రైవింగ్ మామ్ క్రేజీ – మాండరీన్ ఫాంటసీ సూపర్నాచురల్ రొమాంటిక్ కామెడీ వెబ్‌సిరీస్ – అక్టోబర్ 18
అమెజాన్ ప్రైమ్ వీడియో
హెల్లువ బాస్ సీజన్ 3 – ఇంగ్లీష్ అడల్ట్ యానిమేటెడ్ కామెడీ వెబ్‌సిరీస్ – అక్టోబర్ 14
లవ్ ఆఫ్ యువర్ లైఫ్ – తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా సినిమా – అక్టోబర్ 14
ది ట్రేటర్స్ తెలుగు – తెలుగు సైకలాజికల్ రియాలిటీ కాంపిటీషన్ షో – అక్టోబర్ 15
మాస్టర్‌ప్లాన్ – తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ హీస్ట్ సినిమా – అక్టోబర్ 16
తుల్సా కింగ్ సీజన్ 4 – ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్‌సిరీస్ – అక్టోబర్ 16
మెరిలియా మెండోంక: ఆల్ ది ఫీల్స్ – పోర్చుగీస్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సిరీస్ – అక్టోబర్ 16
ఫ్రెండ్స్ సెక్స్ అండ్ గేమ్స్ – జర్మన్ రొమాంటిక్ డ్రామా వెబ్‌సిరీస్ – అక్టోబర్ 16
హోమ్టౌన్ జెయింట్స్ – ఇంగ్లీష్ స్పోర్ట్స్ రియాలిటీ డాక్యుమెంటరీ సిరీస్ – అక్టోబర్ 16
జియో హాట్‌స్టార్
డిస్క్లోజర్ డే – ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా – అక్టోబర్ 12
బిలో డెక్ సీజన్ 13 – ఇంగ్లీష్ రియాలిటీ ఎంటర్టైన్మెంట్ షో – అక్టోబర్ 12
కాఫీ విత్ కరణ్ సీజన్ 9 – హిందీ సెలబ్రిటీ టాక్ షో – అక్టోబర్ 14
విజన్ క్వీస్ట్ – తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ వెబ్‌సిరీస్ – అక్టోబర్ 14
క్రిస్టల్ లేక్ – ఇంగ్లీష్ స్లాషర్ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ – అక్టోబర్ 15
కప్పీ స్క్వాడ్ – తెలుగు డబ్బింగ్ మలయాళ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్‌సిరీస్ – అక్టోబర్ 15
గ్రేస్ అనాటమీ – ఇంగ్లీష్ మెడికల్ రొమాంటిక్ డ్రామా వెబ్‌సిరీస్ – అక్టోబర్ 15
9-1-1 సీజన్ 10 – ఇంగ్లీష్ యాక్షన్, ఎమర్జెన్సీ రెస్క్యూ థ్రిల్లర్ డ్రామా సిరీస్ – అక్టోబర్ 15
ఎంటీవీ రోడీస్: రీబర్త్ – హిందీ రియాలిటీ కాంపిటీషన్ షో – అక్టోబర్ 16
సన్ నెక్స్ట్ ఓటీటీ
కాగితం పడవలు – తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా – అక్టోబర్ 16
ఒరు అన్వేషణతింటే తుడక్కమ్ – మలయాళ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా – అక్టోబర్ 16
ఈటీవీ విన్ ఓటీటీ
బాలు గీత – తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా – అక్టోబర్ 15
లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ – తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా – స్ట్రీమింగ్ తేదీ నిర్ధారించాల్సి ఉంది
జీ5 ఓటీటీ
ఆశా – తెలుగు డబ్బింగ్ మలయాళ డార్క్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా – అక్టోబర్ 16
సోనీ లివ్ ఓటీటీ
డీసీ – తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా – అక్టోబర్ 16
ఆపిల్ టీవీ ప్లస్
టెంజింగ్ – ఇంగ్లీష్ హిస్టారికల్ బయోగ్రాఫికల్ అడ్వెంచర్ డ్రామా సినిమా – అక్టోబర్ 16
సైనా ప్లే ఓటీటీ
అదినాశం వెల్లపొక్కమ్ – మలయాళ కామెడీ థ్రిల్లర్ సినిమా – అక్టోబర్ 16
చౌపాల్ ఓటీటీ
దస్తార్ – పంజాబీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా – అక్టోబర్ 17
తెలుగు ప్రేక్షకులకు ఈ వీకెండ్ స్పెషల్ సినిమాలు ఇవే!
ఈ వీకెండ్ ఓటీటీలో తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మాస్టర్‌ప్లాన్, కాగితం పడవలు, బాలు గీత, ఆశా, డీసీ, కప్పీ స్క్వాడ్, ఎన్న విలై: ది ప్రైస్ ఆఫ్ డిగ్నిటీ ఉన్నాయి. వీటిలో క్రైమ్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఎన్న విలై, మాస్టర్‌ప్లాన్, ఆశా, డీసీ చిత్రాలను చూసేయొచ్చు. రొమాంటిక్, ఎమోషనల్ కథలు కోరుకునేవారు కాగితం పడవలు, బాలు గీత వైపు చూడొచ్చు. సూపర్ హీరో యాక్షన్ ఇష్టపడేవారికి విజన్ క్వీస్ట్ మరో ఆసక్తికరమైన ఎంపిక. మరి ఆలస్యమెందుకు థియేటర్లకు వెళ్లలేని వాళ్ళు .. వీకెండ్ ఓటీటీ సినిమాలతో ఎంజాయ్ చేసేయండి ...
