దిల్ రాజుకి బెదిరింపులు.. రంగంలోకి దిగిన విశ్వ హిందూ పరిషత్?

దిల్ రాజుకి బెదిరింపులు.. రంగంలోకి దిగిన విశ్వ హిందూ పరిషత్?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju)కు బెదిరింపులు వస్తున్నాయట. హనుమాన్ సినిమాకు తక్కువ థియేటర్స్ ఇవ్వడంపై  ప్రేక్షకుల నుండి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. హనుమాన్ లాంటి దేవుడి సినిమాకు తక్కువ థియేటర్స్ ఇవ్వడంపై దిల్ రాజుకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారట. హనుమాన్ సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఇవ్వండి, లేదా లీగల్ నోటీసులు పంపిస్తాం అంటూ అల్టిమేటం జారీ చేశారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇది నిజమేనా? లేదా రూమర్సా అనేది తెలియాలంటే దిల్ రాజు స్పందించాల్సిందే. 

ఇక హనుమాన్ సినిమా విషయానికి వస్తే.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హిందువులకి సూపర్ హీరో అంటే  హనుమాన్ అనే చెప్పాలి. అలాంటి బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటిస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున మహేష్ బాబు గుంటూరు కారం కూడా రిలీజ్ కానుంది. దీంతో హనుమాన్ సినిమాకు చాలా తక్కువ థియేటర్స్ కేటాయించారు. ఇదే విషయంపై ప్రేక్షకుల్లో అసంతృప్తి ఉంది. హనుమాన్ చిన్న సినిమా కాబట్టి కావాలనే ఇలా చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో తాజాగా విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళాలు రంగంలోకి దిగారని వార్తలు వినిపిస్తున్నాయి.