హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గరు అరెస్ట్

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గరు అరెస్ట్

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురిని నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు.  బెంగళూర్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్న బాలాజీ,  వెంకటరత్నారెడ్డి , మురళి లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నిందితుల నుండి కోకైన్ 2.8 గ్రాములు LSD 6 బ్లాడ్స్,  పిల్స్ 25, గంజాయి 2 పాకెట్స్, 72 వేల నగదు, రెండు కార్లు, ఐదు మొబైల్స్ సీజ్ చేశారు పోలీసులు.  పలు సెక్షన్ల కింద వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్  కు తరలించారు. 

గతంలో నేవీలో ఉద్యోగం చేసిన బాలాజీ  కంటి గాయం కారణంగా ఉద్యోగం కోల్పోయాడు.  సినీ పరిశ్రమలో పలువురు కీలక వ్యక్తులకు బాలాజీ డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసలు గుర్తించారు.  నలుగురు వ్యక్తుల నుండి బాలాజీ తరచూ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తి్ంచారు.