సల్మాన్ ఖాన్ కు బెదిరింపు లేఖ.. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పనే..

సల్మాన్ ఖాన్ కు బెదిరింపు లేఖ.. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పనే..

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు బెదిరింపుల కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు ముంబై పోలీసులు. సల్మాన్ ఖాన్ తండ్రి సలీంఖాన్ కు లేఖ అందించిన వ్యక్తులను గుర్తించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ సిద్ధేశ్ హిరామన్ కాంబ్లే అలియాస్ మహాకల్ ను విచారించారు. లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు విక్రమ్ బరాద్ లేఖను సలీంఖాన్ కు ఇచ్చినట్లు తెలిపాడు మహకల్. జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ లేఖను ఇచ్చాడని తెలిపాడు నిందితుడు. లేఖ ఇచ్చేందుకు ముగ్గురు వ్యక్తులు రాజస్థాన్ లోని జలోర్ నుంచి ముంబయికి వచ్చి మహాకల్ ను కలిశారన్నారు. నిందితులను అరెస్టు చేసేందుకు 6 బృందాలను వివిధ ప్రాంతాలకు పంపినట్లు తెలిపారు ముంబై పోలీసులు.