కమల్ హాసన్.. థగ్ లైఫ్ షూటింగ్ షురూ

కమల్ హాసన్..  థగ్ లైఫ్ షూటింగ్ షురూ

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌‌‌‌‌‌‌‌ అనగానే ‘నాయకుడు’ చిత్రం గుర్తొస్తుంది. ముప్ఫై ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్ లైఫ్‌‌‌‌‌‌‌‌’. బుధవారం ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రత్యేకమైన వీడియోను విడుదల చేశారు.

ఇందులో క‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌ హాస‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌‌‌‌‌‌‌‌ ఫొటోస్‌‌‌‌‌‌‌‌ చూపించారు. త్రిష, దుల్కర్ సల్మాన్, జయంరవి, ఐశ్వర్య లక్ష్మీ, గౌతం కార్తిక్, జోజు జార్జ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్. ఉదయనిధి స్టాలిన్‌‌‌‌‌‌‌‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సమర్పణలో కమల్ హాసన్, మణిరత్నం, ఆర్.మహేంద్రన్, శివ అనంత్‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తున్నారు.

ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ కోసం దాదాపు రెండు నెలల పాటు బల్క్ డేట్స్‌‌‌‌‌‌‌‌ను కమల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీలయినంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇండియన్‌‌‌‌‌‌‌‌ 2’ షూటింగ్‌‌‌‌‌‌‌‌ను ఇటీవల పూర్తి చేశారు కమల్ హాసన్.  ప్రభాస్‌‌‌‌‌‌‌‌ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2989’లో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే హెచ్.వినోథ్‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్‌‌లో కమల్ హాసన్ ఓ పాన్ ఇండియ‌‌‌‌‌‌‌‌న్ మూవీ చేయనున్నారు.