వర్మ స్టైల్లో “టైగర్ కేసీఆర్” బయోపిక్ ఫస్ట్ లుక్

వర్మ స్టైల్లో “టైగర్ కేసీఆర్” బయోపిక్ ఫస్ట్ లుక్

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో బయోపిక్ తెరకెక్కిస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీర్ తో సంచనం సృష్టించిన ఈ డేరింగ్ డైరెక్టర్ ఇప్పుడు సీఎం కేసీఆర్ బయోపిక్ ను తీస్తున్నాడు. ఈ సినిమాను టైగర్ కేసీఆర్ పేరుతో తెరకెక్కిస్తున్నట్లు శనివారం ట్విట్టర్ లో అనౌన్స్ చేశాడు. ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్‌ బయోపిక్‌ ‘టైగర్‌ కేసీఆర్‌’ ఫస్ట్‌ లుక్‌ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. వర్మ స్వయంగా సినిమాకు సంబంధించిన పాటను పాడుతూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ వీడియోతో తనదైన స్టైల్‌ లో వివాదాలకు తెరతీశాడు వర్మ.

కేసీఆర్‌ ఉద్యమ నాయకుడిగా ఉన్న సమయంలో  రాష్ట్రరాజకీయాల్లోని కీలక వ్యక్తులంతా ఈ బయోపిక్‌ లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌, కూతురు కవిత, హరీష్‌ రావు, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, వైఎస్‌ జగన్‌. చంద్రబాబు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, రోశయ్య, కిరణ్ కుమార్‌ రెడ్డి, రామోజీ రావులతో పాటు నారా లోకేష్ పాత్ర కూడా ఈ సినిమాలో ఉంటుందని ప్రకటించాడు వర్మ. ఇప్పటికే కేసీఆర్ పేరుతో ఉద్యమసింహాం అనే సినిమా రాబోతుండగా..వర్మ స్టైల్లో మరో కేసీఆర్ ను చూడటం కన్ఫమ్ అంటున్నారు ఫ్యాన్స్.