నెక్స్ట్ ఇయర్ దివాళీకి ‘టైగర్’

నెక్స్ట్ ఇయర్ దివాళీకి ‘టైగర్’

బాలీవుడ్‌‌‌‌లో సల్మాన్ ఖాన్ సినిమా వస్తోందంటే మిగతా సినిమాలన్నీ పక్కకి తప్పుకుని దారి ఇస్తాయి. తమ రిలీజ్ డేట్లు మార్చుకుంటాయి. కానీ ఈసారి సల్మాన్ సినిమాయే ప్లాన్ మార్చుకుంది. కొత్త డేట్‌‌‌‌ని ఫిక్స్ చేసుకుంది. సల్మాన్ ఇమేజ్‌‌‌‌ని మరింత పెంచిన సినిమాల్లో ‘టైగర్’ది స్పెషల్ ప్లేస్. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మూడోది రెడీ అవుతోంది. ‘టైగర్ 3’ పేరుతో మనీష్ శర్మ డైరెక్షన్‌‌‌‌లో యశ్‌‌‌‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ ప్రెస్టీజియస్‌‌‌‌గా నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే యేడు ఏప్రిల్ 21న రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే వర్క్ అనుకున్నట్టుగా సాగకపోవడంతో ఇప్పుడు విడుదల తేదీని మార్చారు. నెక్స్ట్ ఇయర్ దీపావళికి రిలీజ్ చేస్తామని నిన్న అనౌన్స్ చేశారు.

కత్రినా కైఫ్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌లో షారుఖ్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ సినిమా విడుదల కానుంది. దీనితో పాటు ‘కిసీకా భాయ్ కిసీకీ జాన్’ చిత్రం కూడా చేస్తున్నాడు సల్మాన్. వెంకటేష్  ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ మరో రెండు నెలల్లో, అంటే డిసెంబర్ 30న రిలీజ్ కానుంది. ఇక షారుఖ్ ‘పఠాన్‌‌‌‌’తో పాటు ఒక మరాఠీ మూవీలోనూ అతిథి పాత్రల్లో నటిస్తున్నాడు సల్మాన్.