వామ్మో.. పంట చేన్లలో తిరుగుతున్న పెద్ద పులి.. వీడియో చూసి వణికిపోతున్నరు !

వామ్మో.. పంట చేన్లలో తిరుగుతున్న పెద్ద పులి.. వీడియో చూసి వణికిపోతున్నరు !

సకినాపూర్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సకినాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కడపల్లి గ్రామ పంట చేన్లలో పెద్దపులి కనిపించిందన్న వార్త కలకలం రేపుతోంది. స్థానిక యువకుడు పులిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వైరల్‌గా మారింది.

గత కొద్దిరోజులుగా పులి సంచారం ఉందన్న ప్రచారం ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. తాజాగా పులి కనిపించడంతో రైతులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు వెంటనే స్పందించి పులి సంచారాన్ని నిర్ధారించి, ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) రేంజ్ రావణ్ పల్లిలో పులి దాడిలో ఓ ఎద్దు చనిపోయిన ఘటన కూడా కలకలం రేపిన సంగతి తెలిసిందే. మేడిపల్లి గ్రామానికి చెందిన మర్సకోల తెలంగరావుకు చెందిన ఎద్దు శనివారం మేత కోసం రావణ్ పల్లి అటవీ ప్రాంతానికి వెళ్లింది. సాయంత్రం వరకూ ఎద్దు తిరిగి రాకపోవడంతో రైతు అడవిలో గాలించగా.. ఎద్దు కళేబరం కనిపించింది.

వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి పులి దాడి చేసి చంపేసినట్లు నిర్ధారించారు. సిర్పూర్ రేంజ్లో పెద్దపులుల సంచారం ఉన్న క్రమంలో.. పర్మిషన్ లేకుండా ఎవరూ అటవీ ప్రాంతానికి వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు అలర్ట్ చేశారు.