సైలెంట్గా OTTకి వచ్చేసిన టైగర్ 3.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సైలెంట్గా OTTకి వచ్చేసిన టైగర్ 3.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్ లో ఇటీవల భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా టైగర్3(Tiger3). స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman khan) హీరోగా వచ్చిన ఈ సినిమాలో కత్రీనా కైఫ్(katrina kaif) హీరోయిన్ గా నటించారు. యాష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు మనీష్ శర్మ తెరకెక్కించారు. దివాళి కానుకగా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చింది. పఠాన్ సినిమాకు టైగర్3 కి లింక్ చేసి షారుఖ్ గెస్ట్ అప్పియరెన్స్ అని తెలియడంతో టైగర్3 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పఠాన్ కూడా భారీ విజయం సాధించడంతో.. టైగర్3 కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ. 

ఎంతలా అంటే.. మినిమమ్ ఓపెనింగ్స్ కూడా సాదించలేకపోయింది. దీంతో సల్మాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది ఈ సినిమా. దీంతో టైగర్3 ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఈ సినిమా డిజిటల్ హక్కులను కొన్న అమెజాన్ కూడా ఇప్పుడు  అప్పుడు అంటూ ఊరించారు. ప్రేక్షకులు కూడా సంక్రాంతి కానుకగా వస్తుంది అనుకోని వదిలేశారు. తీరా చూస్తే సడన్ గా ఓటీటీలో ప్రత్యేక్షం అయింది టైగర్3 మూవీ. అది చూసి ఆడియన్స్ కూడా ఒక్కసారిగా షాకయ్యారు. జనవరి 7నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ. మరి థియేటర్ లో ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.