తికమక తాండ.. డిసెంబర్ 15న విడుదల

తికమక తాండ.. డిసెంబర్ 15న విడుదల

రామకృష్ణ, హరికృష్ణ  హీరోలుగా వెంకట్‌‌ దర్శకత్వంలో తిరుపతి శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం ‘తికమక తాండ’. రేఖ నిరోష, యాని హీరోయిన్స్. డిసెంబర్ 15న సినిమా విడుదల కానుంది. ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కు నిర్మాతలు సి.కళ్యాణ్, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్  చేశారు.  హీరోలు హరికృష్ణ, రామకృష్ణ మాట్లాడుతూ ‘మా నాన్నగారు మాపై పెట్టిన నమ్మకాన్ని,  మా బ్యానర్‌‌‌‌ పేరుని నిలబెడతామనే నమ్మకం  ఉంది’ అన్నారు.

అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పారు హీరోయిన్స్. వెంకట్ మాట్లాడుతూ ‘1990 గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ సమస్య వల్ల  గ్రామం అంతా మతిమరుపుతో  బాధపడుతుంటారు. ఆ సమస్య నుంచి వారంతా ఎలా బయటపడ్డారనే కథాంశంతో దీన్ని రూపొందించాం’ అని చెప్పాడు.  తెలుగు ప్రేక్షకులు తమ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నామన్నారు నిర్మాత.  మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.