తిరుమలపై రాజకీయాలు చేయొద్దు : కర్నాటక సీఎం డీకేపై ఆగ్రహం

తిరుమలపై రాజకీయాలు చేయొద్దు : కర్నాటక సీఎం డీకేపై ఆగ్రహం

కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.  తిరుమలలో మంత్రులు, ఎమ్మెల్యేలకు నిత్యహారతి దర్శనం అడగడం సరికాదన్నారు.  అయితే మైసూరు మహారాజుకు నిత్యహారతి దర్శనం సాంప్రదాయక గౌరవమని.. రాజకీయ నాయకులకు కాదని తెలిపారు. 

ఎంతో పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రాన్ని   రాజకీయ వేదికగా మార్చొద్దని హితవు పలికారు.  మీ పార్టీ వాళ్లను మెప్పించడానికి దేవుడి సంప్రదాయాలను వాడుకోవద్దంటూ.. కావాలంటే మీ ఊర్లో గుడి కట్టుకుని దర్శనాలు ఇప్పించుకోండన్నారు.

తిరుమల దర్శనాలకు సంబంధించి ఈ రోజు  ఒకరు అడిగితే.. రేపు తమిళనాడు, ఇతర రాష్ట్రాల వారు కూడా అడుగుతారని.. ఇలాంటి విషయాల్లో  టీటీడీ  రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని భాను ప్రకాశ్​ స్పష్టం చేశారు. తరువాత  జరగబోయే ధార్మిక పరిషత్ సమావేశంలో డీకే వ్యాఖ్యలపై చర్చిస్తామని..  డీకే శివకుమార్ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన  డిమాండ్ చేశారు.