భ‌యం లేదా.. భ‌క్తి త‌గ్గిందా : బంగారు వాకిలి ఎదుట‌.. కింద ప‌డిన శ్రీవారి హుండీ

భ‌యం లేదా.. భ‌క్తి త‌గ్గిందా : బంగారు వాకిలి ఎదుట‌.. కింద ప‌డిన శ్రీవారి హుండీ

తిరుమల శ్రీవారి ఆలయంలో అపచారం జరిగింది. శ్రీవారి హుండీ ముఖద్వారం దగ్గర హుండీ ఒక్కసారిగా జారి కింద పడిపోయింది. దీంతో సీల్ వేసిన హుండీ నుండి కానుకలు నేలపై పడిపోయాయి. ఎంతో  భక్తితో కళ్ళకు అద్దుకుని తిరుమలేశునికి సమర్పించిన కానుకలు నేలపాలు కావడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీవారి హుండీని ఆలయం నుంచి పరకామణి మండపానికి తరలిస్తున్న సమయంలో మహాద్వారం దగ్గర హుండీ కిందపడింది. ఆ సమయంలో హుండీలో నుంచి కానుకలు కిందపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది.. హుండీని సరిచేసి.. కానుకలను జాగ్రత్తగా తిరిగి ట్రాలీలోకి ఎక్కించారు. అక్కడి నుంచి పరాకామణి మండపానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కింద పడిపోయిన కానుకలను సిబ్బంది సేకరించి అధికారులకు అప్పగించారు. సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానుకల హుండీ నేలపై పడడంతో ఆలయంలో అపచారం జరిగిందంటున్నారు భక్తులు.