రాహుల్ విజయ్ హీరోగా సాయి బాలి దర్శకత్వంలో కనకరావు తొనంగి, అభిషేక్, గ్యారీ బీహెచ్ నిర్మిస్తున్న ఇంటెన్స్ థ్రిల్లర్ ‘అ’. ఈ మూవీ టైటిల్‌ను రివీల్ చేయడంతోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన అడివి శేష్ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ఈ పోస్టర్లో రాహుల్ విజయ్ చేతిలో లాఠీ పట్టుకుని కూర్చుని కనిపిస్తున్నాడు. ఆయన చుట్టూ నేలంతా రక్తపు మరకలతో కనిపిస్తోంది. ఈ ఇంటెన్స్ విజువల్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో చార్మినార్ కనిపించడం క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. హైదరాబాద్ నేపథ్యంగా ఈ సినిమా రాబోతోందని పోస్టర్ ద్వారా తెలుస్తోంది. దీనిపై ‘అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ’ అనే పదాలను రాయడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అర్చన అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జాన్ విజయ్, సుదర్శన్, మిర్చి కిరణ్, బిత్తిరి సత్తి, దయానంద్ రెడ్డి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
