అన్నపూర్ణ స్టూడియోలో నా సామిరంగ మూవీ టైటిల్ సాంగ్‌‌ షూట్

అన్నపూర్ణ స్టూడియోలో నా సామిరంగ మూవీ టైటిల్ సాంగ్‌‌ షూట్

నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.  శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆషికా రంగనాథ్ హీరోయిన్. సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. టీజర్, పాటలను రిలీజ్  చేయగా వాటికి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌‌ షూట్ జరుగుతోంది.  

అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్‌‌లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోందని టీమ్ అప్‌‌డేట్ ఇచ్చింది. ఈ పాట కోసం ఆస్కార్ అవార్డ్ విజేతలు కీరవాణి ఫుట్ ట్యాపింగ్ ట్యూన్ కంపోజ్ చేయగా, చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ అందించారు. ఈ మాస్ నంబర్‌‌‌‌లో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా అలరించనున్నారు. షూటింగ్‌‌లో 300 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. 

ఈ పాట సినిమాకే స్పెషల్ అట్రాక్షన్‌‌గా ఉంటుందని టీమ్ చెబుతోంది.  టీజర్‌‌లో నాగార్జునతో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. ఇప్పుడు ఈ  ముగ్గురిపై రాబోతున్న పాట థియేటర్స్‌‌ దద్దరిల్లేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.