ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా : నేడు విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌

ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా : నేడు విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌

కేప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌: అంచనాలు అందుకుంటూ, అధిపత్యాన్ని కొనసాగిస్తూ  దూసుకొచ్చిన ఆస్ట్రేలియా.. సంచలనాలు సృష్టిస్తూ ,అనూహ్యంగా  ముందుకొచ్చిన సౌతాఫ్రికా విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యాయి. ఆదివారం జరిగే తుదిపోరులో ఈ రెండు జట్లూ ట్రోఫీ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెమీస్‌‌‌‌‌‌‌‌లో మాజీ చాంపియన్‌‌‌‌‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కు షాకిచ్చిన హోమ్‌‌‌‌‌‌‌‌టీమ్‌‌‌‌‌‌‌‌ సౌతాఫ్రికా తొలిసారి ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరుకోగా.. ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో తిరుగులేని కంగారూ అమ్మాయిలు ఏడోసారి టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌లో తలపడుతున్నారు. హోం అడ్వాంటేజ్‌‌‌‌‌‌‌‌తో తొలిసారి కప్పు నెగ్గాలని సౌతాఫ్రికా ఆశిస్తుండగా.. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఐదుసార్లు విజేతగా నిలిచిన ఆసీస్‌‌‌‌‌‌‌‌ ‘సిక్సర్‌‌‌‌‌‌‌‌’ కొట్టాలని కోరుకుంటోంది.

అత్యంత బలమైన ఆసీస్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకుంటే ఈ టోర్నీలో సఫారీ టీమ్‌‌‌‌‌‌‌‌ కొత్త చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తుంది. గతేడాది వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో  సెమీస్‌‌‌‌‌‌‌‌ చేరినప్పటి నుంచి సౌతాఫ్రికా ఆట ఇంప్రూవ్‌‌‌‌‌‌‌‌ అవుతూ వస్తోంది. లారా వోల్‌‌‌‌‌‌‌‌వార్ట్‌‌‌‌‌‌‌‌, టమ్జిన్‌‌‌‌‌‌‌‌ బ్రిట్స్ బెస్ట్‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌ జోడీగా మారారు.  సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ పని పట్టడంలో ఈ ఇద్దరితో పాటు ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ మరిజానె కాప్‌‌‌‌‌‌‌‌ కీలకంగా నిలిచింది. పేస్‌‌‌‌‌‌‌‌ ద్వయం షబ్నమ్‌‌‌‌‌‌‌‌ ఇస్మాయిల్‌‌‌‌‌‌‌‌, అయబోంక ఖకా రూపంలో తమకు వరల్డ్‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ అటాక్‌‌‌‌‌‌‌‌ ఉందని కెప్టెన్‌‌‌‌‌‌‌‌ సున్‌‌‌‌‌‌‌‌ లుస్‌‌‌‌‌‌‌‌ చెబుతోంది.  హోం గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఆట, ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ సపోర్ట్‌‌‌‌‌‌‌‌ సఫారీలకు అడ్వాంటేజ్‌‌‌‌‌‌‌‌ కానుంది. ఇక, ఆడిన ఏడు ఎడిషన్లలో ఐదుసార్లు టైటిల్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన ఆసీస్‌‌‌‌‌‌‌‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. .

ఈ టోర్నీలో ఓటమి ఎరుగని కంగారూ టీమ్‌‌‌‌‌‌‌‌ అన్ని విభాగాల్లోనూ అత్యంత బలంగా ఉంది. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో అలీసా హీలీ,  బెత్‌‌‌‌‌‌‌‌ మూనీ, కెప్టెన్‌‌‌‌‌‌‌‌ మెగ్‌‌‌‌‌‌‌‌లానింగ్‌‌‌‌‌‌‌‌, బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో  గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌, మేగన్‌‌‌‌‌‌‌‌ షుట్‌‌‌‌‌‌‌‌, డార్సి బ్రౌన్‌‌‌‌‌‌‌‌ సత్తా చాటుతున్నారు.