డ్రగ్స్ తో పట్టుబడిన హీరో లవర్ లావణ్య

డ్రగ్స్ తో పట్టుబడిన హీరో లవర్ లావణ్య

తెలుగు సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం. తెలుగు హీరో లవర్ దగ్గర డ్రగ్స్ ను పట్టుకున్నారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆమె నుంచి 4 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్స్ ను గోవా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చినట్లు స్పష్టం చేస్తున్నారు పోలీసులు. 2024, జనవరి 29వ తేదీ మధ్యాహ్నం.. హైదరాబాద్ సిటీ నార్సింగి పోలీస్ స్టేషన్  పరిధిలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల తనిఖీల్లో హీరో లవర్ పట్టుబడటం సంచలనంగా మారింది. 

పట్టుబడిన హీరో లవర్ పేరు లావణ్యగా స్పష్టం చేశారు పోలీసులు. ఆ హీరో రాజ్ తరుణ్ అంట. లావణ్య దొరికిన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆమెపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గోవా నుంచి ఎంత మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చింది.. ఎన్ని రోజుల క్రితం తీసుకొచ్చింది.. ఎలా తీసుకొచ్చింది.. తీసికొచ్చిన డ్రగ్స్ ను ఇంకెవరికైనా ఇచ్చిందా.. ఆమె డ్రగ్స్ వాడుతుందా అనే విషయాలపై విచారణ చేస్తున్నారు పోలీసులు.  

సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి తెరపైకి రావటం కలకలం రేపుతోంది. హీరో లవర్ లావణ్యనే పట్టుబడటం చర్చనీయాంశం అయ్యింది. ఇందులో రాజ్ తరుణ్ పాత్ర ఉందా లేదా అనే విషయాలను విచారిస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.