టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాధినేని అరెస్ట్.. పెళ్లి చేసుకుంటానని మోసం చేశారంటూ నటి ఫిర్యాదు!

టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాధినేని అరెస్ట్.. పెళ్లి చేసుకుంటానని మోసం చేశారంటూ నటి ఫిర్యాదు!

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని వివాదంలో చిక్కుకున్నారు.  పెళ్లి చేసుకుంటానని మోసం చేశారంటూ ఓ సినీ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో  పోలీసులు పవన్ ను అరెస్ట్ చేశారు. చాలా కాలంగా తనతో సహజీవనం చేసి లైంగికంగా వాడుకున్నారని ఆరోపించింది.  దీంతో విజయవాడలో గోల్కొండ పోలీసులు పవన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

దర్శకుడు పవన్ కు ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లులు ఉన్నారు. అంతుకాదు ఇతర మహిళలతో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పడంతో పాటు తనతో సహజీవనం చేసి లైంగికంగా వాడుకున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి క్రమంగా దూరం పెట్టారని వాపోయింది. 

ఇప్పటికే పెళ్లై పిల్లులు ఉన్నారన్న సంగతి తెలిసి పవన్ నిలదీయగా.. తాను విడుకుల ప్రక్రియలో ఉన్నానని .. అవి ఖరారైన తర్వత పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేశారని నటి పేర్కొంది. నటి ఫిర్యాదులో బీఎన్ఎస్ సెక్షన్లు 69, 115 (2) కింద కేసు నమోదు చేసి పవన్ న్ అరెస్ట్ చేశారు. రిమాండ్ కు తరలించారు.

పవన్ పలు ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి , సేనాపతి, సినిమాలతో పాటు, పిల్ల , ఈ ఆఫీస్ లో , కమిట్‌మెంటల్,  దయా వంటి వెబ్ సిరీస్‌లకు కూడా దర్శకత్వం వహించారు.  ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడిలా అరెస్ట్ కావడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. 

ప్రస్తుతం మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో 'ఆకాశంతో ఒక తారా' మూవీకి డైరెక్టర్ గా చేస్తున్నారు. నటి ఫిర్యాదుతో చర్యలకు దిగిన పోలీసులు..  పవన్ ను అరెస్ట్ చేసి 15 రోజులు రిమాండ్ కు తరలించినట్లు తెలుస్తోంది.