ఇన్ స్టాగ్రామ్ లో ప్రభాస్

ఇన్ స్టాగ్రామ్ లో ప్రభాస్

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ లో ముందుండే సినీస్టార్స్..ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి అకౌంట్స్ లో పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటారు. ప్రస్తుత జనరేషన్ లో ప్రతీ స్టార్ వీటిని ఫాలో కావాల్సిందే. లేటెస్ట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ తెరిచాడు.  ప్రొఫైల్ లో యాక్టర్‌ ప్రభాస్‌ అన్న పేరు పెట్టుకున్నాడు. ఆ ఒక్క పేరు చూసి ఫ్యాన్స్ ఇన్ స్టాగ్రామ్ ను ఫాలో అవుతున్నారు.  అకౌంట్ ఇంకా వెరిఫై కాలేదు.

ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఏ పోస్ట్‌ పెట్టకపోయినా..ప్రభాస్ అకౌంట్ కు 7 లక్షలకు చేరువలో ఫాలోవర్లు ఉన్నారు. దటీజ్ ప్రభాస్ కున్న రేంజ్ అంటున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ సినిమాకు సంబంధించిన అప్‌ డేట్‌ ను ఫస్ట్ ఫొటోగా ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. సుజిత్‌ తెరకెక్కిస్తున్న సాహోలో.. ప్రభాస్ సరసన హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఆగస్ట్‌ 15న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సాహో.

https://www.instagram.com/actorprabhas/