Sreeleela: వరుస ప్లాపుల్లో శ్రీలీల..ధమాకా వంటి హిట్ దక్కేనా!

Sreeleela: వరుస ప్లాపుల్లో శ్రీలీల..ధమాకా వంటి హిట్ దక్కేనా!

గుంటూరు కారం సినిమాతో ట్రెండింగ్ లోకి వచ్చిన హీరోయిన్ శ్రీలీల(Sreeleela). రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిసందD సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడి చేతిలో ఇంతకూ సినిమాలున్నాయా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొదటి సినిమా నిరాశ పరిచినా కూడా బ్యాక్ టు బ్యాక్‌ ఆఫర్లు వచ్చాయి.

ధమాకా సినిమా హిట్ అవ్వడంతో శ్రీలీల మరింత స్పీడ్ పెంచింది. ఒకే సారి అయిదు ఆరు సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.రికార్డు స్థాయి పారితోషికం తీసుకుంటూ వరుస సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీలీలకి ఇటీవల అన్ని నిరాశ పరచుతూ వచ్చాయి. 

భగవంత్ కేసరి మినహా మిగిలిన సినిమాలన్నీ నిరాశ పర్చాయి. ఇప్పుడు శ్రీలీల చేతిలో సినిమాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలొస్తున్నాయి. పవన్‌ కల్యాణ్​ సినిమా ఉస్తాద్‌ భగత్ సింగ్ లో శ్రీలీల ఎంపిక అయ్యిందనే వార్తలొచ్చాయి. అయితే ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఎప్పుడు ప్రారంభమవుతుందనేది తెలియదు. నితిన్ తో రాబిన్ హుడ్‌ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలొచ్చినా క్లారిటీ లేదు. విజయ్ దేవరకొండ తో శ్రీలీల ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంతకు మించి ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు పెద్దగా లేవనే అంటున్నారు. తమిళంలో ఏమైనా సినిమాలున్నాయా..? ఉండే ఉంటాయి అంటున్నారు కొందరు. ఇంతకూ ఈ లీల మళ్లీ తెలుగులో ఎప్పుడు గోల చేస్తుందో! కేవలం డ్యాన్సులకే పరిమితమైన ఆ పాత్రలు కూడా ఆమెకు పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోతున్నాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreeleela (@sreeleela14)